AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భవిష్యత్తు ఆర్థిక ఇబ్బందుల మయం కాకుడదంటే.. ఈ సింపుల్‌ టిప్స్ ఫాలో అయిపోండి..

భవిష్యత్తుపై ప్రతి ఒక్కరూ ఎన్నో కళలు కంటారు. ఒక్కొక్కరూ తమ భవిష్యత్తును ఒక్కో రకంగా ఆలోచించుకుంటారు. ఎంత ఆలోచించినా.. సరైన పద్ధతిలో ప్లానింగ్ లేకపోతే.. ఆర్థిక ఇబ్బందులతో జీవితం సతమతమైపోతుంది. సంపాదించినప్పుడు ఖర్చు..

భవిష్యత్తు ఆర్థిక ఇబ్బందుల మయం కాకుడదంటే.. ఈ సింపుల్‌ టిప్స్ ఫాలో అయిపోండి..
Life Insurance Policy (Representative Image)
Amarnadh Daneti
|

Updated on: Nov 30, 2022 | 8:00 AM

Share

భవిష్యత్తుపై ప్రతి ఒక్కరూ ఎన్నో కళలు కంటారు. ఒక్కొక్కరూ తమ భవిష్యత్తును ఒక్కో రకంగా ఆలోచించుకుంటారు. ఎంత ఆలోచించినా.. సరైన పద్ధతిలో ప్లానింగ్ లేకపోతే.. ఆర్థిక ఇబ్బందులతో జీవితం సతమతమైపోతుంది. సంపాదించినప్పుడు ఖర్చు పెట్టడం బాగానే ఉంటుంది. కాని సంపాదన లేని సమయంలో డబ్బు విలువ తెలుస్తుంది. చాలా మంది ఎక్కువుగా చేసే పని భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. ప్రస్తుతం గడుస్తోంది కదా అనే ధోరణితో ఉంటారు. ఇది ఏ వ్యక్తికి కూడా మంచిది కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. భవిష్యత్తు ఆర్థిక ఇబ్బందులతో సతమతం కాకుండా.. బంగారు మయం కావాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కాలంతో పాటు దేశంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రపంచీకరణ కారణంగా గత మూడు దశాబ్దాలలో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. గతంలో మనుషులకు, ఇప్పటివాళ్లకు చాలా తేడాలున్నాయి. పూర్వం సంపాదనతో పాటు పొదుపునకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో కొంతమేర డబ్బులు నిల్వ వేయగలిగారు. అదే ప్రస్తుత యువత అయితే తమ ఖర్చులు గట్టెక్కుతున్నాయి కదా అనే ధోరణితో ఉన్నారు. ప్రస్తుతం పిల్లల స్కూల్ ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆర్థిక స్వావలంబనకు అర్థం కూడా మారిపోయింది. ఇలాంటి తరుణంలో కెరియర్ ప్లానింగ్ తో పాటు ఫైనాన్షియల్ ప్లానింగ్ చాల అవసరం అంటున్నారు ఆర్థిక నిపుణులు. భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం.

జీవిత బీమా(టర్మ్ పాలసీ)

పేరుకు తగినట్లే లైఫ్ ఇన్య్సూరెన్స్ జీవితానికి భరోసానిస్తుంది.వీటిలో టర్మ్ పాలసీలు ఉంటాయి. 15 ఏళ్ల క్రితం టర్మ్ పాలసీ తీసుకోవాలంటే చాలా శ్రమతో కూడిన ప్రహసనం. కానీ, ప్రస్తుతం కేవలం రెండు, మూడు వర్కింగ్ డేస్‌లో చాలా సులభంగా టర్మ్ పాలసీ లభిస్తుంది. మొదట్లో ఉద్యోగికి మాత్రమే ఇచ్చిన టర్మ్ పాలసీని ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఉద్యోగి జీవిత భాగస్వామికి కూడా ఇస్తున్నాయి. ఏదైనా దురదృష్టకర సంఘటనలో ఉద్యోగి తన కుటుంబానికి దూరమైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం టర్మ్ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం. విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగి కుటుంబం తమ జీవన ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా ఉండటానికి టర్మ్ పాలసీ ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా రెండో ఆలోచన లేకుండా టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిది. 30 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ఉద్యోగులకు టర్మ్ పాలసీ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ప్రీమియంలో పెరుగుదల గణనీయంగా ఉంటుంది. నలభై ఏళ్ళ వయసు దాటాక టర్మ్ పాలసీ దొరకడం కూడా అంత సులభం కాదు. టర్మ్ పాలసీ మొత్తం ఎంత ఉండాలి అనే విషయం మీద చాలా నిబంధనలు ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన పాలసీ తీసుకోవచ్చు.

ఆరోగ్య బీమా

మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ స్పెషాలటీ ఆసుపత్రుల ద్వారా నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తున్నా పేషెంట్ల బిల్ కూడా ఎక్కువగానే ఉంటోంది. మెటర్నిటీ మొదలు, పీడియాట్రీ, రూట్ కెనాల్ లాంటి చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా అధికంగా ఉంటున్నాయి. ఈ ఖర్చులన్నీ నెల జీతం మీద భారం కాకుండా ఉద్యోగిని రక్షించడం హెల్త్ పాలసీ లక్ష్యం. టర్మ్ పాలసీ లాగే హెల్త్ పాలసీ కూడా చిన్న వయసులో తీసుకుంటే తక్కవ ప్రీమియం ఉంటుంది. హెల్త్ పాలసీలో ఉన్న మరొక ముఖ్య విషయం కొత్త పాలసీ తీసుకోవడం కంటే, అంతకు ముందే ఉన్న పాలసీలోకి కుటుంబ సభ్యులను చేర్చడం తక్కువ ఖర్చుతో కూడిన పని. భార్యాభర్తలు, పిల్లలున్న కుటుంబానికి ఇప్పుడు కొత్త పాలసీ తీసుకోవడం కంటే వాళ్ళల్లో ఒకరికి కొన్నేళ్ళుగా ఉన్న పాలసీలోకి జీవిత భాగస్వామిని, పిల్లలను చేర్చడం ద్వారా ప్రీమియాన్ని తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పొదపు

భవిష్యత్ అవసరాల కోసం డబ్బు పొదుపు చేయడం ఆర్థిక స్వావలంబనకు ముఖ్యమైన అంశం.నెల జీతం మీద ఆధారపడే ఉద్యోగులు తప్పకుండా పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. పొదుపు చేయడానికి అనేక మార్గాలున్నాయి. వీటిలో నష్టాలు లేకుండా డబ్బులు సురక్షితంగా ఉంటాయని భావించిన వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పొదుపు చేయవచ్చు. సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉండే అవకాశం ఎక్కువుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..