AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Weekly Off Changed: ఎస్‌బీఐలో వీక్లీ ఆఫ్ డే మారింది..! ఇక ముందు ఈ బ్రాంచ్‌లో శుక్రవారం మూసివేయబడుతుంది

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆదివారం సెలవు దినాన్ని శుక్రవారానికి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

SBI Weekly Off Changed: ఎస్‌బీఐలో వీక్లీ ఆఫ్ డే మారింది..! ఇక ముందు ఈ బ్రాంచ్‌లో శుక్రవారం మూసివేయబడుతుంది
Sbi
Sanjay Kasula
|

Updated on: Nov 30, 2022 | 7:53 AM

Share

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆదివారం సెలవు దినాన్ని మరో రోజుకు మార్చింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఓ బ్రాంచ్‌లో ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. మహారాష్ట్రలోని గోవండి బ్రాంచ్‌ డిసెంబరు 1 నుంచి తమ ఉద్యోగులకు వీక్లీ ఆఫ్‌ని మార్చాలని నిర్ణయించింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI ఆదివారం వారపు సెలవులో పెద్ద మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎస్‌బీఐకి చెందిన ఒక బ్రాంచ్‌లో వారంవారీ సెలవు ఆదివారం కాకుండా శుక్రవారం ఉంటుంది. SBI గోవండి శాఖ తన వారపు సెలవు దినాన్ని ఆదివారం కాకుండా శుక్రవారంగా మార్చింది.

బ్రాంచ్ స్థాయిలో తీసుకున్న నిర్ణయం..

ప్రతీ ఆదివారం వీక్లీ ఆఫ్ ని ఈ బ్రాంచ్‌లో శుక్రవారానికి మార్చారు. బ్యాంక్ బ్రాంచ్ పరిసర ప్రాంతాల్లో నివసించే మైనారిటీ కమ్యూనిటీ ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాఖ ఈ నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ. IANS అందించిన సమాచారం ప్రకారం, SBI గోవండి బ్రాంచ్ వెలుపల నోటీసు అతికించింది. బ్యాంకు శాఖలో సెలవును మార్చాలని స్థానికుల నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ బ్రాంచ్ పరిసర ప్రాంతాల్లో నివసించే మైనారిటీ వర్గాల ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సంచలనంగా మారింది. అయితే, గోవండి బ్రాంచ్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయంపై సంప్రదించినప్పటికీ SBI అధికారి ఎవరూ ఏమీ చెప్పలేదు.

టైమింగ్స్ ఇలా..

డిసెంబర్ 1 నుంచి ఆదివారం నుండి గురువారం వరకు.. రోజువారీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని వేళలు సాధారణంగా ఉంటాయని ఆ నోటీస్ లో పేర్కొంది. ప్రతీ శుక్రవారం సెలవు దినంగా ప్రకటించి.. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలలో మూసివేయబడుతుందని తెలిపింది.

వివాదంగా మారిన నిర్ణయం..

నోటీసు అతికించిన బ్యాంక్ వెలుపల పోస్ట్ చేసిన నోటీసు ప్రకారం, డిసెంబర్ 1, 2022 నుంచి SBI గోవండి బ్రాంచ్ అన్ని శుక్రవారాల్లో మూసివేయబడుతుంది. దీనితో పాటు, బ్యాంకు ఈ శాఖ ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలలో మూసివేయబడుతుంది. ఈ బ్యాంకు శాఖ ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాధారణంగా పని చేస్తుంది.  అయితే.. గోవండి బ్రాంచ్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయంపై ఎస్బీఐ అధికారులు సంప్రదించకపోవడం గమనార్హం. అయితే ఈ నిర్ణయం ఆ స్థానిక ప్రజల అవసరాల మేరకు తీసుకున్నారా..? లేక ఆ స్థానిక ప్రజలే ఇలాంటి బోర్డును బ్రాంచ్ ముందు ప్రదర్శించారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

సోషల్ మీడియాలోని ఈ నిర్ణయంపై విమర్శలు 

ప్రస్తుతం స్థానిక డిమాండ్ మేరకు ఎస్ బీఐ గోవండి శాఖ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో వీక్లీ ఆఫ్ లేదా పబ్లిక్ హాలిడే పట్టింపు లేదని బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే సెలవు ఉన్నప్పటికీ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

Follow Us
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.