Andhra Pradesh: బీ రెడీ.. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. మంత్రి సీదిరి అప్పల్రాజు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చని మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన కామెంట్స్ చేశారు. కాబట్టి కార్యకర్తలు, నాయకులు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమైక్యతతో ముందుకు వెళ్లాలన్న...

Andhra Pradesh: బీ రెడీ.. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. మంత్రి సీదిరి అప్పల్రాజు సంచలన కామెంట్స్
Seediri Appalaraju
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 29, 2022 | 6:48 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చని మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన కామెంట్స్ చేశారు. కాబట్టి కార్యకర్తలు, నాయకులు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమైక్యతతో ముందుకు వెళ్లాలన్న మంత్రి అప్పలరాజు.. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలోనే మనం ఉన్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి బతికి ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కొందరు లేనిపోనివి ప్రచారం చేస్తున్నారని, వారు ఎంత చేసినా తమను ఏమీ చేయలేరని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరిట ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. నచ్చిన వాడికి ఒకలాగా, నచ్చని వాడికి ఒకలాగా చూస్తూ చంద్రబాబు నాయుడుకు పాలన చేశారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నూతన క్యాంపు కార్యాలయాన్ని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్​తో కలిసి మంత్రి అప్పలరాజు ప్రారంభించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 175కు 175 స్థానాలు గెలుచుకోవాల్సిందేనని పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేఏశారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తైంది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. వాటి ఆధారంగా తదుపరి వ్యూహం ఖరారు చేసే పనిలో ఉన్నారు. గతంలో 151 సీట్లు గెల్చుకున్న వైసీపీ.. ఈసారి 175 సీట్లు గెల్చుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్లీన్ స్వీప్ చేయడం తమ లక్ష్యమని, ఇది కష్టమేమీ కాదని చెప్పారు.

మరోసారి అధికారం కైవసం చేసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను, కుట్రలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇవ్వనున్నట్లు చంద్రబాబు వెల్లడించటంతో, ఇప్పుడు సీఎం జగన్ ఆ నియోకవర్గాల్లో పార్టీ అభ్యర్దులను ప్రకటిస్తున్నారు. చంద్రబాబు అంచనా వేస్తున్న ముందస్తు ఎన్నికల అంచనాల పైన వైసీపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా, ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రసవత్తర పోరు తప్పదనే విషయాన్ని తప్పక గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..