Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: జోడోయాత్రలో న్యూ గెటప్‌.. ధోవతితో ఉజ్జయిని ఆలయంలో రాహుల్ పూజలు..

రాహుల్‌గాంధీ గెటప్‌ మార్చారు. కొత్త లుక్‌లో కనిపించారు. ధోవతి కట్టుకుని భక్తుడిగా మారిపోయారు. మహాశివుడికి పూజలు నిర్వహించారు. భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌- ఉజ్జయిని ఆలయంలో మహాకాళేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేశారు.

Rahul Gandhi: జోడోయాత్రలో న్యూ గెటప్‌.. ధోవతితో ఉజ్జయిని ఆలయంలో రాహుల్ పూజలు..
Rahul Gandhi visits at Shree Mahakaleshwar
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 30, 2022 | 12:26 PM

భోలేనాథ్ ఆశీస్సులు పొందేందుకు రాహుల్ గాంధీ మహాకాళేశ్వరుడి ఆలయానికి చేరుకున్నారు. ఇక్కడ బాబా మహాకాళ్‌కు నియమ నిబంధనల ప్రకారం పూజలు చేసి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ధోవతి కట్టుకుని పరమభక్తుడిగా మారిపోయాడు. మహాకాళేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. పూజల తర్వాత ఆలయమంతా కలియదిరిగారు. ఆలయ అర్చకులు ఆయనకు గంధం, తిలకం పెట్టారు. మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని సందర్శించిన తర్వాత రాహుల్ గాంధీ ఉజ్జయిని సామాజిక న్యాయ సముదాయానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జై మహాకాళ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తన భారత్‌ జోడోయాత్ర అనుభవాలు కూడా చెప్పుకొచ్చారు. తానూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రయాణిస్తున్నానని,ఇది తపస్సు కాదని, ప్రజల నుంచి తనకు లభిస్తున్న ప్రేమే అసలైన బలమన్నారు రాహుల్‌.

చిన్న వ్యాపారులు,పరిశ్రమల వెన్నెముకను విచ్ఛిన్నం చేసిన నోట్ల రద్దు, జీఎస్టీ ఆయుధాలు, విధానాలు కాదని బీజేపీని ఉద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు. కరోనా సమయంలో బెంగళూరు, ముంబై, పంజాబ్ నుండి దేశంలోని ఒక మూల నుండి మరొక మూలకు వెళ్లిన కార్మికులు పడ్డ కష్టాలు అన్నీ..ఇన్నీ కావన్నారు. దేశంలో యువత ఇంజినీరింగ్‌ చేసి కూలీ పనులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో పూర్తైంది. ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారి దగ్గర ప్రారంభమైంది. ఇంకా ఏడు రాష్ట్రాల్లో సాగనుంది. ప్రతి రాష్ట్రంలో భిన్న నేపథ్యాలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తులు రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలీ, ఆయన స్టైల్ యాత్రకు విభిన్నతను చేకూర్చుకుంది.

ఇవి కూడా చదవండి

యాత్ర మొదలైన దగ్గర నుంచి రాహుల్ గాంధీ వార్తల్లో నిలుస్తున్నారు. ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. మొన్న మీసాలు తిప్పిన వీడియోతోపాటు తాజాగా ధోవతి కట్టి భక్తుడిలా మారిపోయిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం