Chicken Curry: చికెన్ వడ్డించలేదని హైదరాబాద్‌లో ఆగిపోయిన పెళ్లి.. సీన్ కట్ చేస్తే..
చిన్న చిన్న కారణాలతో పీటల మీద పెళ్లి ఆగి పోవడం ఈ మధ్యకాలంలో కామన్‌గా మారింది. కట్నం తక్కువైందని.. తాము అడిగినవి ముట్టలేదనే చిన్న చిన్న కారణాలతో ఆగిపోతున్నవి మనం చాలా స్లారు వింటున్నాం. కానీ, చిత్రంగా చికెన్ వడ్డించలేదంటూ ఓ పెళ్లి ఆగిపోయింది.
ఈ మధ్యకాలంలో ప్రేమ కారణంగా పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. కానీ, చిత్రంగా ఓ పెళ్లి మాత్రం చికెన్ వడ్డించలేదని ఆగిపోయింది. తన స్నేహితులకు చికెన్ వడ్డించలేదంటూ పెళ్లికి బ్రేక్ చెప్పాడు పెళ్లికొడుకు. ఈ సంఘటన ఎక్కడో జరిగింది కాదు అత్యంత వేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ మహా నగరంలో జరిగింది. షాపూర్‌నగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీకి చెందిన వరుడు, కుత్బుల్లాపూర్‌కు చెందిన వధువుకు సోమవారం తెల్లవారుజామున వివాహం చేయడానికి భారీ ఏర్పాట్లు చేశారు. షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం రాత్రి విందుకు భారీ ఏర్పాటు చేశారు పెళ్లి కూతురి తరఫువారు.
పెళ్లి కూతురు బిహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబం. దీంతో వారిది శాకాహార కుటుంబం. దీంతో వీరు కేవలం వెజ్ వంటలు మాత్రమే చేశారు. విందు దాదాపుగా పూర్తికావొచ్చింది. విందు ముగింపు సమయంలో పెళ్లికుమారుడి మిత్రులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదని గొడవపడి తినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వరుడి తరపు బంధువులు వచ్చిన వారికి కావలసింది వడ్డించలేదంటూ వధువు తరపు వారిని హేళన చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పెళ్లికొడుకు పెళ్లి కూతురి కుటుంబ సభ్యుతో వాగ్వాదానికి దిగాడు. ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తన మిత్రులకు చికెన్ పెట్టాల్సిందే అంటూ పట్టుబట్టాడు. దీంతో ఇరుపక్షాల మధ్య గొడవ జరిగింది. మరికాసేపట్లో వివాహం అనగా ఆగిపోయింది. వెంటనే పెళ్లికుమార్తె కుటుంబికులు జీడిమెట్ల సీఐ పవన్‌ను కలిసి, విషయం వివరించారు. ఆయన రెండు కుటుంబాలవారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఈనెల 30న వివాహం చేయాలని వధూవరుల కుటుంబికులు నిర్ణయానికి వచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం