Students shocking behaviour: విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన టీచర్.. గర్భిణీ అని చూడకుండా స్టూడెంట్స్ గ్యాంగ్ దాడి..
ఈ ఘటన నవంబర్ 27న జరిగినట్లు సమాచారం. తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులు గర్భిణీ టీచర్‌పై దాడికి పాల్పడినట్టుగా తెలిసింది.
మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అని నేర్చుంటాం. తల్లిదండ్రుల తర్వాత స్థానంలో ప్రతి ఒక్కరూ గౌరవించే స్థానం గురువులది. వారు అందించిన విద్య, విజ్ఞానమే భావితరాలకు బంగారు బాట. కానీ, ఇక్కడ మాత్రం దారుణం చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరూ తలదించుకునే విధంగా ఓ ఉపాధ్యాయురాలిని అవమానించి, దాడి చేశారు ఇక్కడి విద్యార్థులు. ఇలాంటి అమానవీయ ఘటన అస్సాంలోని దిబ్రూఘర్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటన ప్రతి ఒక్కరినీ సిగ్గుతో తల దించుకునేలా చేస్తుంది. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై దాడికి దిగారు కొందరు విద్యార్థులు. బాధిత మహిళా టీచర్ 5 నెలల గర్భిణి అని కూడా తెలిసింది. ఈ ఘటన తెలిసిన ప్రతి ఒక్కరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిబ్రూఘర్‌లోని మోరన్ సబ్ డివిజన్‌లోని దోమర్దలాంగ్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఘటన జరిగింది. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని కొందరు విద్యార్థులపై ఉపాధ్యాయురాలు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆమెను రీప్లేస్ చేయడానికి 22 మంది విద్యార్థులు మహిళా ఉపాధ్యాయురాలిపై గ్యాంగ్ కట్టారు. ఈ ఘటన నవంబర్ 27న జరిగినట్లు సమాచారం. తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులు గర్భిణీ టీచర్‌ను కొట్టినట్టుగా సమాచారం.
పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని ,పాఠశాల నిబంధనలను పాటించకపోవడం, గైర్హాజరు కావడంపై ఉపాధ్యాయురాలు విద్యార్థులపై ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన రోజు ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు వచ్చి ఆ లేడీ టీచర్‌ని రక్షించారు. బాధ్యులైన విద్యార్థులను గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి