AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ న్యూస్.. రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే ఏం చేయాలి..? ప్రాసెస్ ఇదే..

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు అలర్ట్. మీరు రెండు యూఏఎన్ నెంబర్లు ఉన్నాయా.. ఈపీఎఫ్‌వో రూల్స్ ప్రకారం ఒకే యూఏఎన్ నెంబర్‌ను కలిగి ఉండాలి. ఒకవేళ రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే ఒక నెంబర్‌ను ఇనాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మెయిల్ పెట్టాల్సి ఉంటుంది.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ న్యూస్.. రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే ఏం చేయాలి..? ప్రాసెస్ ఇదే..
Epfo
Venkatrao Lella
|

Updated on: Mar 16, 2026 | 9:46 AM

Share

దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి ఈపీఎఫ్‌వో అకౌంట్ అనేది ఉంటుంది. అయితే తొలిసారి ఉద్యోగంలో చేరినప్పుడు యాజమాన్యం పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తుంది. తొలి జీతం అందుకున్నాక మీకు వచ్చే శాలరీ స్లిప్‌లో యూఏఎన్ నెంబర్ ఉంటుంది. ఆ యూఏఎన్ నెంబర్ అనేది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. మీరు ఎన్ని కంపెనీలు మారినా యూఏఎన్ నెంబర్ అనేది అలాగే ఉంటుంది. కానీ కంపెనీలు మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ నెంబర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి..? పాత కంపెనీ పీఎఫ్ అకౌంట్లోని నగదును ఎలా బదిలీ చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఉద్యోగం మారినప్పుడు..

ఉద్యోగం మారినప్పుడు యూఏఎన్ నెంబర్‌తో పీఎఫ్ అకౌంట్‌ను లింక్ చేస్తారు. యూఏఎన్  నెంబర్‌పై ప్రత్యేక పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. మీరు ఉద్యోగం మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్‌ను కొత్త కంపెనీ పీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా మీరు ఇది సులువుగా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి వెళ్లి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకునే ప్రాసెస్ సులభతరం అవుతుంది. పీఎఫ్ వివరాలను ట్రాక్ చేయడం, అకౌంట్ ఇనాక్టివ్ కాకపోవడం, విత్ డ్రాలో జాప్యాలు జరగకుండా ఇది సహాయపడుతుంది.

ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి..?

-ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

-యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వండి

-పాస్‌వర్డ్ మర్చిపోతే రీసెట్ చేసుకోండి

-ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంచుకుని ఒక సభ్యుడు-ఒకే పీఎఫ్ ఖాతా అనే దానిపై లింక్ చేయండి

-రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, యూఏఎన్ నెంబర్, ఇతర సమాచారాన్ని ఎంటర్ చేయండి

-మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్న మీ పాత కంపెనీ ఈపీఎఫ్ అకౌంట్ గురించి సమాచారాన్ని నమోదు చేయాల్సిన చోట కొత్త విండో పాప్ అప్ అవుతుంది

-సమర్పించు అనేక బటన్‌పై క్లిక్ చేసి డిక్లరేషన్ బాక్స్ గుర్తించండి

రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే..?

ఒకవేళ మీకు రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే uanepf@epfindia.gov.in కు మెయిల్ పంపండి. ఒక యూఏఎన్ నెంబర్‌ను ఇనాక్టివ్ చేయమని రిక్వెస్ట్ పెట్టండి. ఈపీఎఫ్‌వో అధికారులు పరిశీలించి ఒక నెంబర్‌ను బ్లాక్ చేస్తారు. దీని వల్ల మీరు ఒకే యూఏఎన్ నెంబర్ నుంచి సేవలు పొందవచ్చు. పాత యూఏఎన్ నెంబర్‌ను రద్దు చేశారు. కొత్త యూఏఎన్ నెంబర్ అలాగే ఉంచుతారు.

Follow Us