Kerala POCSO Court: కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తికి కఠిన కారాగార శిక్ష.. ఎన్ని సంవత్సరాలో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ ప్రబుద్ధుడికి  కేరళలోని పోక్సో కోర్టు 107 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2020లో జరిగిన ఈ  ఘటనకు సోమవారం(నవంబర్ 28) కేరళలోని పతనంతిట్ట పోక్సో కోర్టు తీర్పును..

Kerala POCSO Court: కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తికి కఠిన కారాగార శిక్ష.. ఎన్ని సంవత్సరాలో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Rape
Follow us

|

Updated on: Nov 30, 2022 | 1:42 PM

కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ ప్రబుద్ధుడికి  కేరళలోని పోక్సో కోర్టు 107 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2020లో జరిగిన ఈ  ఘటనకు సోమవారం(నవంబర్ 28) కేరళలోని పతనంతిట్ట పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది.  మానసిక వైకల్యంతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి(45) అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన ఇరుగుపొరుగువారికి, స్కూల్ ఉపాధ్యాయులకు చెప్పుకుని విలపించింది. వారు ఈ విషయాన్ని స్థానిక  పోలీసులకు తెలియజేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ఈ ఘటన 2020లో జరిగింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా బాలికకు వైద్య పరీక్షలు చేయించగా తండ్రి కారణంగా ఆమెకు తీవ్ర గాయాలయినట్లు తేలింది. ఇంకా బాలిక తెలియజేసిన వివరాల ప్రకారం.. ఆమెపై తన తండ్రి అనేక సందర్భాల్లో దాడి చేశాడు. కాగా బాలిక తల్లిదండ్రులు ఘటన జరగడానికి ఏడాది ముందుగానే విడిపోయారు. దాంతో ఆ బాలిక తన తండ్రితోనే ఉంటుంది.

అయితే, ఈ కేసులో నవంబర్ 28న విచారణ జరిపిన కేరళలోని పతనంతిట్ట పోక్సో కోర్టు బాలిక తండ్రిని  దోషిగా ప్రకటించడంతో పాటు అనేక శిక్షలతో కలిపి మొత్తం 107 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అంతేకాక అతనికి రూ.4 లక్షల జరిమానా కూడా  విధించింది. జస్టిస్ జయకుమార్ జాన్ నిందితుడిని దోషిగా ప్రకటించి ఐపీసీలోని సెక్షన్ 3769 లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ), POCSO చట్టంలోని వివిధ సెక్షన్లు, అలాగే జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 75 కింద అతనికి 107 సంవత్సరాల జైలుశిక్షను విధించింది.

అంతకుముందు ఆగస్టులో కూడా, కేరళలోని ఇడుక్కి జిల్లాలో బాలికపై అత్యాచారం చేసి గర్భం దాల్చినందుకు 24 ఏళ్ల వ్యక్తికి ఏకంగా 62 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అదేవిధంగా, ప్రాథమిక పాఠశాలలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు కన్నూర్‌కు చెందిన 50 ఏళ్ల ఉపాధ్యాయుడికి 79 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది.

ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం