Wedding Video: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. నెట్టింట వీడియో వైరల్
పెళ్లి అంటే ఆనందాల వేడుక. డప్పు చప్పుళ్లు, మేళ తాళాలు, బరాత్ లతో ఆద్యంతం ఉర్రూతలూగించే అపురూప కార్యక్రమం. అయితే.. సంతోషం నింపాల్సిన పెళ్లి వేడుక ఆ కుటుంబంతో దుఖాన్ని మిగిల్చింది. పెళ్లి వేదికపై...
పెళ్లి అంటే ఆనందాల వేడుక. డప్పు చప్పుళ్లు, మేళ తాళాలు, బరాత్ లతో ఆద్యంతం ఉర్రూతలూగించే అపురూప కార్యక్రమం. అయితే.. సంతోషం నింపాల్సిన పెళ్లి వేడుక ఆ కుటుంబంతో దుఖాన్ని మిగిల్చింది. పెళ్లి వేదికపై బంధు మిత్రులతో కలిసి ఆనందంగా డాన్స్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో ఆనంద సమయం కాస్తా విషాదంగా మారిపోయింది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాశి పిప్లాని కత్రా ప్రాంతంలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. నవంబరు 25న జరిగిన ఓ పెళ్లి వేడుకలో 40 ఏళ్ల వ్యక్తి డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. దాంతో పెల్లింట విషాదం నిండిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో వ్యక్తి అప్పటి వరకూ తమతో కలిసి ఆడిపాడిన అతను ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో అక్కడున్నవారందరినీ కలిచివేసింది. బాధితుడిని మనోజ్ విశ్వకర్మగా గుర్తించారు. పిప్లాని కత్రాలో ఓ పెండ్లి వేడుకకు వెళ్లిన మనోజ్ అక్కడ డ్యాన్స్ చేస్తూ మరణించారు. కాగా ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. అంతవరకూ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా స్ట్రోక్‌తో కుప్పకూలిపోతున్నారు. ఈ హఠాత్ పరిణామాలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్న తరుణంలో ఈ మహమ్మారి ప్రభావం ఇలా చూపిస్తుందా అని అనుమానిస్తున్నారు.
राजस्थान के पाली में साली की शादी में स्टेज पर डांस करते-करते जीजा की मौत हो गई। जिस घर में शादी की खुशियां मनाई जा रही थीं, वहां मातम पसर गया। मामला महात्मा गांधी कॉलोनी का शुक्रवार रात का है। मृतक 42 साल के अब्दुल सलीम पठान सरकारी स्कूल में PTI (फिजिकल ट्रेनिंग इंस्ट्रक्टर) थे। pic.twitter.com/cDPwzutVM5
— Prasoon Shukla ??प्रसून शुक्ला??राष्ट्र प्रथम (@prasoon001shukl) November 13, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం