Raveena Tandon: పులికి దగ్గరగా వెళ్లిన బాలీవుడ్ నటి రవీనా టాండన్.. సర్కార్ ఆగ్రహంతో చిక్కుల్లో పడింది..
రవీనా షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ ఫారెస్ట్ వెల్లడించారు.
బాలీవుడ్ నటి రవీనా టాండర్ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. మధ్యప్రదేశ్ లోని టైగర్ సఫారీలో రవీనా టాండన్ పెద్దపులికి అతిసమీపంగా వెళ్లి ఫోటోలు తీయడంపై వివాదం రాజుకుంది. సాత్పురా టైగర్ రిజర్వ్ సఫారీ టూర్‌లో ఆమె ప్రయాణిస్తున్న వాహనం పులి దగ్గరికి వెళ్లడంపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. ఫారెస్ట్ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేయబోతున్నారు. నవంబర్ 22న మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో ఉన్న సత్పురా టైగర్ రిజర్వ్ ను సందర్శించిన రవీనా టాండన్.. పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రవీనా వాహనం పులికి దగ్గరగా వెళ్లిన సమయంలో అది గాండ్రించడం కూడా వీడియోలో చూడొచ్చు. అందులో రవీనా టాండన్ కు చేరువలోనే పులి ఉన్న ఓ వీడియో ఉండడంతో అధికారులు స్పందించారు.
రవీనా షేర్ చేసిన ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డీవో) ఆఫ్ ఫారెస్ట్ వెల్లడించారు. నవంబర్ 22న రవీనా టాండన్ తబోడాకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్, అక్కడే ఉన్న అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించనున్నారు.
#satpuratigerreserve .@News18MP reports.A tiger gets close to the deputy rangers bike. One can never predict when and how tigers will react. It’s the Forest Department licensed vehicle,with their guides and drivers who are trained to know their boundaries and legalities. pic.twitter.com/mTuGLSVPER
— Raveena Tandon (@TandonRaveena) November 29, 2022
ఈ ఘటనపై రవీనా జీపు డ్రైవర్‌కు, విధుల్లో ఉన్న అధికారులకు నోటీసులు అందజేసి విచారిస్తామని సత్పురా టైగర్ రిజర్వ్ అధికారులు తెలిపారు. సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు ఫారెస్ట్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ధీరజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. తదుపరి చర్యల కోసం విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.
మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి