Vijay Deverakonda: ఈడీ ముందుకు నటుడు విజయ్ దేవరకొండ.. అధికారులు ఏం ప్రశ్నించనున్నారు.?
లైగర్ సినిమా వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొన్నటి మొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ పాటు, నటి ఛార్మీలను అధికారులు..
లైగర్ సినిమా వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొన్నటి మొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ పాటు, నటి ఛార్మీలను అధికారులు విచారించారు. ఛార్మీ, పూరీ జగన్నాథ్‌ల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నగదు జమ అయిందన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. సుమారు12 గంటలపాటు కొనసాగిన విచారణలో పూరీ, ఛార్మీలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండను కూడా విచారించేందుకు సిద్ధమైంది ఈడీ. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి విజయ్ కాసేపటి క్రితమే బయలుదేరి వెళ్లాడు. లైగర్ సినిమా రెమ్యునరేషన్, అడ్వాన్స్‌లపై విజయ్‌ని ఈడీ విచారించనుంది. ఈ సినిమా నిర్మాణంలో విదేశాల నుంచి పలువురు రాజకీయ నేతల అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విజయ్‌ని ఈడీ ప్రశ్నించనుంది. ఈడీ విచారణంలో విజయ్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
లైగర్ సినిమా నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఈడీ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే దర్శకుడు పూరీని, ఛార్మీని విచారించిన అధికారులు ఇప్పుడు విజయ్‌ను విచారించనున్నారు. మరి ఈడీ విచారణ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే లైగర్ చిత్రం విషయంలో.. డిస్ట్రిబ్యూటర్ల నుంచి పూరీకి బెదిరింపు కాల్స్ రావటం.. దానికి పూరీ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇవ్వటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..