- Telugu News Photo Gallery Cinema photos Hollywood heroines embracing South Indian movies like Sunny Leone Olivia Morris and Maria Ryaboshapka
సౌత్ లో హాలీవుడ్ ఫ్లేవర్.. సన్నీ లియోన్ మొదలుకుని మరియా వరకు అదరగొడుతున్న విదేశీ అందాలు
సౌత్ సిల్వర్ స్క్రీన్ మీద నార్త్ బ్యూటీస్ సందడి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య భాషల హద్దులు మాత్రమే కాదు. దేశాలు సరిహద్దులు కూడా దాటేస్తున్నారు మేకర్స్.
Updated on: Nov 30, 2022 | 11:36 AM

సౌత్ సిల్వర్ స్క్రీన్ మీద నార్త్ బ్యూటీస్ సందడి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య భాషల హద్దులు మాత్రమే కాదు. దేశాలు సరిహద్దులు కూడా దాటేస్తున్నారు మేకర్స్. రీసెంట్ టైమ్స్‌లో సౌత్ స్క్రీన్ మీద ఫారిన్ బ్యూటీస్ సందడి కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.

సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌కు రావటంతో కథలను గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ మధ్య ట్రిపులార్ సినిమాలో నటించిన విదేశీ భామ గురించి నేషనల్ లెవల్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సినిమాలో బ్రిటీష్ యువతిగా కనిపించిన ఒలివియా మోరీస్‌ను ఇండియన్ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకున్నారు.

రీసెంట్‌గా సౌత్ స్క్రీన్ మీద తళుక్కుమన్న మరో విదేశీ అందం మరియా. శివ కార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ తెరకెక్కించిన ప్రిన్స్ సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మరియా. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా... మరియాకు సౌత్ ఇండస్ట్రీ గ్రాండ్‌గానే స్వాగతం పలికింది.

ధనుష్ రీసెంట్ మూవీ నానే వరువేన్‌లోనూ ఓ విదేశీ భామ సందడి చేశారు. దాదాపు పదేళ్లుగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఇల్లి అవ్రమ్... ధనుష్ మూవీతో సౌత్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయకపోవటంతో ఇల్లికి పెద్దగా గుర్తింపు రాలేదు.

విదేశీ భామల జోరు ఈ మధ్యే మొదలైందేమీ కాదు. ఎవడు, 2.ఓ లాంటి సినిమాల్లో నటించిన అమీ జాక్సన్, పవన్‌తో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్న నర్గీస్ ఫక్రీ, ఇండియన్ స్క్రీన్ షేక్ చేస్తున్న సన్నీ లియోన్‌లు కూడా విదేశీ అందాలే.




