Hit 2 Movie: హిట్‌లో నాని నటించకపోవడానికి కారణమేంటి.? దర్శకుడు శైలేష్ ఆసక్తికర విషయాలు..
శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానరప్ నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా...
శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానరప్ నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా హిట్-2 తెరకెక్కిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల దగగ్ర పుడతోన్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు శైలేష్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..
హీరో నాని హిట్ చిత్రానికి నిర్మాతగా మారడానికి గల కారణంపై శైలేష్ క్లారిటీ ఇచ్చాడు. నిజానికి తాను తొలుత దర్శకుడు నాని హీరోగా చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేశాడంటా.. ఇందులో భాగంగానే నానికి స్టోరీని వినిపించడంటా, దర్శకుడు నానితో సినిమా తీయాలనుకుంటే.. నాని మాత్రం తానే సినిమాను నిర్మిస్తానన్నారంటా దాంతో హిట్‌లో హీరో కావాల్సిన నాని, నిర్మాతగా మారాడు. అయితే నానితో సినిమా చేసి పెద్ద హిట్ ఇవ్వాలని ఉందన్న శైలేష్, హిట్ 3 సినిమా భారీ ప్లాన్ చేస్తున్నాం.. త్వరలోనే వివరాలు చెబుతానన్నారు. మరి హిట్3లో హీరోగా ఎవరన్న విషయంపై క్లారిటీ రాలేదు. నానినే హీరోగా తీసుకుంటారా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక హిట్2 లో అడివి శేష్‌ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘హిట్1లో విశ్వక్ పోషించిన పాత్రకు సంబంధించిన కథ నా దగ్గర ఉంది. అయితే.. ఒక కొత్త విషయాన్ని చెప్పేందుకు ఫ్రాంచైజీని ప్లాన్ చేశాం. కథాంశం ఆధారంగానే ఆర్టిస్టులను ఎంచుకుంటాను, హిట్2 క్లైమాక్స్‌ను రాసుకునేటప్పుడు అడివి శేష్ అయితే బాగుంటాడని అనిపించింది’ అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..