AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: రాశీఖన్నాకు సంతోషాన్నిచ్చేది ఏంటో తెలుసా.? బర్త్‌డే బేబీ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

అందం, అభినయం కలగలిపిన అతికొద్ది మంది హీరోయిన్లలో రాశీఖన్నా ఒకరు. తనదైన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ. మద్రాస్‌ కేఫ్‌ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మనం సినిమాలో గెస్ట్‌ రోల్‌ ద్వారా తెలగు ప్రేక్షకులకు పలకరించింది...

Rashi Khanna: రాశీఖన్నాకు సంతోషాన్నిచ్చేది ఏంటో తెలుసా.? బర్త్‌డే బేబీ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Rashi Khanna
Narender Vaitla
|

Updated on: Nov 30, 2022 | 11:22 AM

Share

అందం, అభినయం కలగలిపిన అతికొద్ది మంది హీరోయిన్లలో రాశీఖన్నా ఒకరు. తనదైన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ. మద్రాస్‌ కేఫ్‌ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మనం సినిమాలో గెస్ట్‌ రోల్‌ ద్వారా తెలగు ప్రేక్షకులకు పలకరించింది. అనంతరం ఊహలు గుసగుసలాడే సినిమాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిందీ బ్యూటీ. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిందీ చిన్నది.

తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో నటిస్తున్న రాశీఖన్నా పుట్టిన రోజు నేడు. 1990 నవంబర్‌ 30న ఢిల్లీలో జన్మించిందీ బ్యూటీ. ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజీలో బీఏ చదువుకున్న రాశీఖన్నా.. 2013లో హిందీలో వచ్చిన మద్రాస్‌ కేఫ్‌ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన కెరీర్‌కు సంబంధించిన వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలను సైతం అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేసిందీ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

మొక్కలు నాటుతున్న సమయంలో తీసిన ఫొటోలను పోస్ట్‌ చేసిన రాశీ ఖన్నా.. ‘మొక్కలు నాటడం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే పని. అంతేకాకుండా నా పుట్టిన రోజున ఇదొక పద్ధతిలా మారింది’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టుకు రాశీ అభిమానులు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలతో హోరెత్తిస్తున్నారు. ఇక రాశీఖన్నా కెరీర్ విషాయానికొస్తే తాజాగా ‘సర్దార్‌’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న రాశీ ప్రస్తుతం హిందీలో ‘యోధా’ సినిమాలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..