Samantha: సౌత్‌కొరియాకు పయనమవుతోన్న సమంత.. నెల రోజులపాటు అక్కడే.. ఎందుకంటే..

నటి సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సామ్ స్వయంగా ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. సమంత ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి రకరకాల వార్తలు..

Samantha: సౌత్‌కొరియాకు పయనమవుతోన్న సమంత.. నెల రోజులపాటు అక్కడే.. ఎందుకంటే..
Samantha
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 30, 2022 | 12:44 PM

నటి సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సామ్ స్వయంగా ప్రకటించి అభిమానులను ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. సమంత ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి రకరకాల వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సమంత ఆరోగ్యం తీవ్రంగా క్షీణించందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆమె మళ్లీ ఆసుపత్రిలో చేరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని సమంత మేనేజర్ స్పష్టతనిచ్చాడు. దీంతో ఈ విషయం అక్కడితో ఆగిపోయింది.

అయితే తాజాగా మరోసారి సమంతకు సంబంధించి వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సమంత చికిత్సలో భాగంగా సౌత్‌ కొరియా పయణమవుతోందనేది సదరు వార్త సారంశం. అడ్వాన్స్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగానే సమంత సౌత్‌ కొరియాకు వెళుతోందని, నెల రోజుల పాటు అక్కడే ఉండనుందని వార్తలు షికార్లు చేస్తు్న్నాయి. ఈ చికిత్స పూర్తి అయిన తర్వాత తిరిగి ఇండియాకు వచ్చి ఖుషీ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సమంత మేనేజర్ నుంచి కానీ, సమంత నుంచి కానీ ఎలాంటి సమాచారం రాలేదు.

ఇదిలా ఉంటే మొన్నటి మన్న సమంత ఆయుర్వేదిక్‌ చికత్స చేయించుకోనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్‌ చికిత్సలో భాగంగా ఆయుర్వేద్‌ ట్రీట్‌మెంట్ చేయుంచుకోనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తర్వాత తెలిసింది. మరి సమంత నిజంగానే సౌత్‌ కొరియా వెళ్తుందా.? లేదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా యశోద చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాల నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఇక గుణశేఖర్ దర్వకత్వంలో తెరకెక్కిన శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకోగా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..