Amazon India: భారత్‌లో మరో వ్యాపారానికి మంగళం పాడిన దిగ్గజ సంస్థ.. వారం రోజుల్లోనే మూడోది..

కొన్ని రోజుల క్రితమే భారత్‌లో అమెజాన్ అకాడమీ,  ఫుడ్ డెలివరీ బిజినెస్‌లకు చెక్ పెట్టిన నేపథ్యంలో మరో వ్యాపార సేవలకు కూడా మంగళం పాడింది. కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్, హుబ్లీ చుట్టుపక్కల చిన్నచిన్న..

Amazon India: భారత్‌లో మరో వ్యాపారానికి మంగళం పాడిన దిగ్గజ సంస్థ.. వారం రోజుల్లోనే మూడోది..
Amazon
Follow us

|

Updated on: Nov 30, 2022 | 12:36 PM

ఇటీవలే భారత్‌లో రెండు వ్యాపారాలను మూసివేసిన రిటైల్ దిగ్గజ కంపెనీ అమెజాన్ మరో  సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితమే భారత్‌లో అమెజాన్ అకాడమీ,  ఫుడ్ డెలివరీ బిజినెస్‌లకు చెక్ పెట్టిన నేపథ్యంలో మరో వ్యాపార సేవలకు కూడా మంగళం పాడింది. కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్, హుబ్లీ చుట్టుపక్కల చిన్నచిన్న షాపుల కోసం ఏర్పాటుచేసిన హోల్‌సేల్ ఇ-కామర్స్ వెబ్‌సైట్, దశలవారీగా కనుమరుగవుతోంది.  www.amazondistribution.in అనే ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా అమెజాన్ ఆయా నగరాల్లోని కొనుగోలు అవసరాలను తీర్చింది. అయితే భారత్‌లో అమెజాన్ స్థిరంగానే ఉంటుందని, తన వ్యాపార సేవలను యధావిధిగా కొనసాగిస్తుందని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది.

‘‘మా వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్ష ప్రక్రియలో భాగంగా, బెంగళూరు, మైసూర్ మరియు హుబ్లీ చుట్టూ ఉన్న చిన్న దుకాణాల కోసం మా హోల్‌సేల్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ డిస్ట్రిబ్యూషన్‌ను నిలిపివేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము’’ అని అమెజాన్ ఇండియా తన తాజా ప్రకటనలో పేర్కొంది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఇ-కామర్స్ వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్ బిజినెస్-టు-బిజినెస్ (B2B), ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ (అమెజాన్ బిజినెస్)ను కూడా కలిగి ఉంది, ఇవి యధావిధిగా కొనసాగుతాయని కూడా తెలిపింది అమెజాన్. 

కాగా, బెంగుళూరులో అమెజాన్ ఇండియా నడుపుతున్న ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని మూసివేయడమే కాకుండా, అమెజాన్ తన ఎడ్‌టెక్ వ్యాపారం ‘అమెజాన్ అకాడమీ’ని మూసివేస్తున్నట్లు గత వారం ప్రకటించింది. టెక్ కంపెనీలు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో అవి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మెటా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలు కూడా ఇదే క్రమంలో అనేక మార్పులను చేపట్టాయి. ఆ మార్పుల నేపథ్యంలో  ఆయా కంపెనీలలోని ఉద్యోగులు స్వచ్చంధ రాజీనామాను అందిస్తుండగా, మరికొందరు ఆ కంపెనీలో భారత్‌లో అసలు ఉద్యోగాలను కల్పించలేదనే ఆరోపణలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి