Road Accident in UP: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో హైవేపై ఘోర ప్రమాదం.. ప్రమాదంలో ఆరుగురు మృతి..
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, దాదాపు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. లక్నో సమీపంలో రోడ్డు మార్గంపై
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, దాదాపు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. లక్నో సమీపంలో రోడ్డు మార్గంపై బస్సు వెళ్లి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులందరినీ సమీప ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం.
అయితే హైవేపై ఆవరించి ఉన్న పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రథమికంగా అభిప్రాయపడుతున్నారు. జైపూర్ నుంచి బహ్రైచ్‌కు వస్తున్న ఈద్గా డిపో బస్సు బహ్రైచ్-లక్నో హైవేపై బుధవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో జర్వాల్ రోడ్‌లోని ఘఘ్రాఘాట్ స్టేషన్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న తాకిడికి బస్సు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అదే సమయంలో 15 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న జర్వాల్ పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘోర రోడ్డు ప్రమాదం సమాచారం అందిన వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ దినేష్ చంద్ర, ఎస్పీ కేశవ్ కుమార్ చౌదరి, ఉన్నతాధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Bahraich, Uttar Pradesh | Six people died and 15 injured in a collision between a Roadways bus and a truck in Tappe Sipah, Bahraich, confirms SHO Rajesh Singh. The injured have been sent to a hospital. The cause of the accident is yet to be ascertained. Police present at the spot pic.twitter.com/A5MPOomd05
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 30, 2022
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ట్రక్కు డ్రైవర్‌తో సహా ఆరుగురు వ్యక్తులు ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వారు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ దినేష్ చంద్ర మాట్లాడుతూ ‘‘ఉదయం హృదయ విదారక రీతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ నుంచి వస్తున్న ఈద్గా డిపో బస్సు ప్రమాదానికి గురవడంతో అంతులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. ఘటనలో గాయపడిన 15 మందిని పోలీసు సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు అన్ని విధాలా సాయం అందించాలని అధికారులందరికీ సూచించారు వారు సూచించారు’’ అని అన్నారు.
తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం యోగి ..
मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज ने जनपद बहराइच में सड़क दुर्घटना में हुई जनहानि पर गहरा दुःख व्यक्त किया है।
महाराज जी ने वरिष्ठ अधिकारियों को घटनास्थल पर जाकर तत्परता के साथ राहत-बचाव कार्य युद्ध स्तर पर संचालित करने और घायलों के समुचित उपचार हेतु निर्देश दिए हैं।
— Yogi Adityanath Office (@myogioffice) November 30, 2022
బుధవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి తగు చికిత్స అందించాలని, వారు త్వరగా కోలుకునేలా చూడాలని డీఏం, పోలీసు ఉన్నతాధికారులను యోగి ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం