IND Vs NZ 3rd ODI: నేడు చివరి వన్డే కోసం న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత్.. సిరీస్‌ను సమం చేసుకోవాలనే పట్టుదలతో బ్యాటింగ్‌కు దిగిన ధావన్ సేన..
క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో వన్డే నేడు(నవంబర్ 30)న జరుగుతోంది. 3 వన్డేల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అయినా సిరీస్‌ను డ్రాగా ముగించాలనే
క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో వన్డే నేడు(నవంబర్ 30)న జరుగుతోంది. 3 వన్డేల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అయినా సిరీస్‌ను డ్రాగా ముగించాలనే ఉద్దేశంతో టీమ్ ఇండియా మైదానంలోకి దిగింది. అయితే ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపకపోతేనే ఫలితం వెలువడుతుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ జట్టు ముందుగా బౌలింగ్‌ను ఎంచుకుంది. అనంతరం ఇరుజట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్లను ప్రకటించాయి. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే శిఖర్ ధావన్ మ్యాచ్‌కు వెళ్తున్నాడు. అయితే న్యూజిలాండ్ టీమ్ మాత్రం చిన్న మార్పుతో ఫీల్డింగ్‌కు దిగింది. న్యూజిలాండ్ ఆటగాడు బ్రెస్‌వెల్‌కు బదులుగా ఆడమ్ మిల్నేని జట్టులోకి తీసుకుంటున్నట్లుగా కేన్ ప్రకటించాడు.
భారత్ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు జట్టు సారథి శిఖర్ ధావన్, శుభమాన్ గిల్ రంగంలోకి దిగారు. అయితే ఈ వన్డే సిరీస్ విశేషమేమంటే.. మూడు మ్యాచ్‌లలోనూ భారత్ టాస్ ఓడింది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో ఓడిన ధావన్ సేనకు రెండో వన్డేలో వర్షం కారణంగా ఎదురుదెబ్బ తగిలింది. అయితే క్రైస్ట్‌చర్చ్‌లో ఆడిన 6 మ్యాచ్‌లలో టీమ్‌ఇండియా ఒక్కటి మాత్రమే గెలిచింది. అలాగే కివీస్‌తో ఆడిన గత 5 వన్డేల్లో 4 ఓడిపోయింది టీమిండియా. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్‌ను కాపాడుకోవాలంటే కనీసం సమం చేసుకోవడమే భారత్‌కు ఉన్న అవకాశం. ఇందుకోసం ఈ రోజు జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాఅయినా గెలవాలి.