PM Kisan Saman Nidhi Yojana: పీఎం కిసాన్ లబ్ధిదారునిగా మారాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..

కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలలో కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి..

PM Kisan Saman Nidhi Yojana: పీఎం కిసాన్ లబ్ధిదారునిగా మారాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..
Pm Kisan Samman Nidhi Ekyc
Follow us

|

Updated on: Nov 30, 2022 | 8:22 AM

కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలలో కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత పొందడానికి ఈ-కేవైసీ ప్రక్రియ తప్పనిసరి. కేవైసీ లేకపోతే 13వ విడత డబ్బులు అందవు. ఇందుకోసం రేషన్ కార్డు కాపీని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ఆధార్‌ను కూడా సమర్పించాలి. పీఎం కిసాన్ యోజన తదుపరి విడత పొందడానికి రేషన్ కార్డ్ సాఫ్ట్ కాపీ కాకుండా పీడీఎఫ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం రేషన్ కార్డ్ కాపీని సమర్పించాలి. రేషన్ కార్డు హార్డ్ కాపీకి బదులు సాఫ్ట్ కాపీ పీడీఎఫ్ ఫైల్ అప్‌లోడ్ చేయాలి.

రేషన్‌కార్డు సాఫ్ట్‌ కాపీ పీడీఎఫ్‌ మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని, మునుపటిలా సాఫ్ట్‌ కాపీ ఫోటోస్టాట్‌ ఇవ్వడం వల్ల పనిచేయదు. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఈ పథకం కింద రైతులు లబ్ధి పొందడానికి ఈకేవైసీ తప్పనిసరి.  డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) అగ్రికల్చర్ బీహార్ వెబ్‌సైట్ ప్రకారం “ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ధిదారులకు ఈకేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. లేకుంటే వారు పథకం ప్రయోజనాలను కోల్పోతారు”

పీఎం కిసాన్ ఈకేవైసీ ఛార్జీలు:
పీఎం కిసాన్ లబ్ధిదారులు తమ ఈకేవైసీని మీసేవా, ఈసేవా కేంద్రాలలో కూడా నమోదు చేయించుకోవచ్చు. బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించి ఈకేవైసీ అప్‌డేట్‌ల కోసం వారి సమీప వసుధ స్టేషన్‌లో కూడా  చేసుకోవచ్చు. ఇందుకు రుసుము చార్జీ కేవలం రూ. 15 రూపాయలనే వసూలు చేస్తారు.
“సీఎం  కిసాన్ లబ్ధిదారులు అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్ ద్వారా కూడా స్వయంగా ఆధార్‌ను లింక్ చేసుకోవచ్చు. లేదా వారి సమీపంలోని CSC/వసుధ కేంద్రం నుంచి, లేదా మీసేవా కేంద్రాల నుంచి బయోమెట్రిక్ పద్ధతి ద్వారా ఈ ప్రక్రియను చేసుకోవచ్చు. దీని కోసం భారత ప్రభుత్వం  రూ. 15 రుసుమును నిర్ణయించింది’2 అని పీఏం కిసాన్ వెబ్‌సైట్ పేర్కొంది.
ఈకేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి..?
  1. pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. తర్వాత PM Kisan eKYCపై క్లిక్ చేయండి.
  3. మీ ఆధార్ కార్డ్ వివరాలు, క్యాప్చా కోడ్‌ను నింపండి.
  4. సెర్చ్‌పై క్లిక్ చేయండి.
  5. మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ఇంకా మీకు వచ్చిన OTPని ఫిల్ చేయండి.
  6. ‘ప్రామాణీకరణపై సమర్పించు’ ఎంచుకోండి
లబ్ధిదారుని వివరాలు సరిగా మ్యాచ్ అయితే . పీఎం కిసాన్ ఈకేవైసీ విజయవంతంగా పూర్తయినట్లే.

పీఎం కిసాన్ ప్రయోజనాలు:

ఇవి కూడా చదవండి

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున మూడు సమాన విడతలుగా రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఈ సొమ్మును కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున 12 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. అక్టోబర్ 2022లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12వ విడత మొత్తాన్ని రైతుల ఖాతాకు బదిలీ చేశారు. 13వ విడత రావాలంటే ఈకేవైసీ చేయని వారు వెంటనే ఈ పనిని పూర్తి చేసుకోవడం మంచిది.

పథకం లబ్ధిదారునిగా నమోదు చేయించుకోవడానికి అవసరమైన సమాచారం:

PM-కిసాన్ పథకం కింద నమోదు చేసుకోవడానికి, కింది వివరాలు, రికార్డులు అవసరం:
• పేరు, వయస్సు, లింగం మరియు వర్గం (SC/ST)
• ఆధార్ సంఖ్య
• బ్యాంక్ ఖాతా సంఖ్య ,  IFSC కోడ్
• మొబైల్ నంబర్ – ఇది అవసరం లేనప్పటికీ, ప్రయోజన బదిలీకి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడానికి వీలుగా అందుబాటులో ఉన్నప్పుడు అందించవచ్చని సూచించబడింది.
మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి