AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajnath Singh: వారికి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు ఇవ్వాలి.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేక వినతి

దేశం కోసం సేవ చేసే సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి అండగా నిలవడం ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ, మాజీ సైనికుల సంక్షేమ శాఖ మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సాయుధ దళాల పతాక దినోత్సం..

Rajnath Singh: వారికి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు ఇవ్వాలి.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేక వినతి
Rajnath Singh
Narender Vaitla
|

Updated on: Nov 30, 2022 | 7:41 AM

Share

దేశం కోసం సేవ చేసే సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి అండగా నిలవడం ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ, మాజీ సైనికుల సంక్షేమ శాఖ మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సాయుధ దళాల పతాక దినోత్సం సీఎస్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ చేసిన, అలాగే సేవలందిస్తూ దేశ సమగ్రతను కాపాడుతోన్న సాయుధ దళాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఉగ్రవాదులను, యుద్ధాలను మన సైనికులు అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇందులో భాగంగా చాలా మంది ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో మంది సైనికులు శారీరకంగా వికలాంగులయ్యారు. మన సైనికుల కుటుంబానికి సంబంధించిన పూర్తి బాధ్యత మనందరిపై ఉంది. సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే వీర జవాన్ల వల్లే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం, భయం లేకుండా మన జీవితాలను గడుపుతున్నాము’ అని రాజ్‌నాథ్ అన్నారు. సైనికుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన రాజ్‌నాథ్ సింగ్, ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మన దేశ భద్రతకు భరోసా ఇచ్చే సైనికుల సంక్షేమం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది అందరి కర్తవ్యమని రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు.

దేశ భద్రత పటిష్టంగా లేని దేశంలో పరిశ్రమలు, వ్యాపారాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని ఆయన ఉద్ఘాటించారు. ప్రైవేటు సంస్థలు మాజీ సైనికులకు ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. క్రమశిక్షణ కలిగిన మాజీ సైనికుల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం అతి చిన్న వయస్సులో పదవీ విరమణ పొందుతున్న 60 వేల మంది సైనికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రైవేటు రంగానికి ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..