స్వాతంత్రానికి ముందు ‘భారత ప్రధానమంత్రి’ ఆయనే.. కేంద్రమంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
స్వాతంత్య్రానికి ముందు అవిభక్త భారతదేశానికి తొలి ప్రధానమంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ నోయిడాలో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు..

స్వాతంత్య్రానికి ముందు అవిభక్త భారతదేశానికి తొలి ప్రధానమంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ నోయిడాలో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని బ్రిటిషు పాలకుల నుంచి విముక్తి కల్పించడానికి ‘ఆజాద్ హింద్ సర్కార్’ ని సుభాష్ చంద్రబోస్ స్థాపించారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టినప్పడి నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సరైన గౌరవం కల్పించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ రచనలు ఉద్దేశపూర్వకంగా వెలుగులోకి రాకుండా గత ప్రభుత్వాలు చేశాయన్నారు. నేతాజీకి సంబంధించిన అనేక పత్రాలు గతంలో ఎప్పుడూ బహిరంగ పర్చలేదన్నారు. 2014లో, నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సరైన గౌరవం ఇవ్వడం ప్రారంభమైందన్నారు. తాను హోమంత్రిగా ఉన్నప్పుడు సుబాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులను కలిశానని, అలాగే ఆయనకు సంబంధించిన 300కు పైగా పత్రాలను దేశ ప్రజల ముందుంచామన్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. నేతాజీ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని, అవి తెలిస్తే ప్రజలే ఆశ్చర్యపోతారన్నారు. చాలా మంది భారతీయులు ఆయనను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడిగా, స్వాంతత్య్ర పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడిన వ్యక్తిగా మాత్రమే తెలుసని, అయితే అవిభాజ్య భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నారని కొద్ది మందికి మాత్రమే తెలుసని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. ఆజాద్ హింద్ ఫౌజ్, ఆజాద్ హింద్ సర్కార్ స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలోని మొదటి స్వదేశీ ప్రభుత్వమని, దీనిని మొదటి స్వదేశీ సర్కార్ అని పిలవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.

Netaji Subhash Chandra Bose
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1943 అక్టోబర్ 21వ తేదీన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. అప్పట్లె ఈ ప్రభుత్వానికి స్వంత పోస్టల్ స్టాంపులు, కరెన్సీ, రహస్య ఇంటెలిజెన్స్ సర్వీస్ ఉన్నాయని.. పరిమిత వనరులతో ఇటువంటి వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధారణ విషయం కాదన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..







