Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savings: ఎంత సంపాదించినా పొదుపు కావడం లేదా.. ఈ చిట్కాలు మీకోసం..

ప్రతి వ్యక్తి తన జీవనం సాగించడానికి ఏదో ఒక పని లేదా వ్యాపారం చేయడం ద్వారా ఆదాయం అర్జిస్తారు. ఏదో రకంగా తాము మంచి జీవితాన్ని గడపాలని కోరుకోవడం కోసం సంపాదిస్తూ ఉంటారు. నేటి ఆధునిక కాలంలో ఎంత సంపాదించినా సరే పొదుపు కన్పించడం లేదు. వచ్చింది వచ్చినట్లే ఖర్చు..

Savings: ఎంత సంపాదించినా పొదుపు కావడం లేదా.. ఈ చిట్కాలు మీకోసం..
Savings
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 09, 2022 | 1:38 PM

ప్రతి వ్యక్తి తన జీవనం సాగించడానికి ఏదో ఒక పని లేదా వ్యాపారం చేయడం ద్వారా ఆదాయం అర్జిస్తారు. ఏదో రకంగా తాము మంచి జీవితాన్ని గడపాలని కోరుకోవడం కోసం సంపాదిస్తూ ఉంటారు. నేటి ఆధునిక కాలంలో ఎంత సంపాదించినా సరే పొదుపు కన్పించడం లేదు. వచ్చింది వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. ముఖ్యంగా వేతన జీవులు ఒకటో తేదీ జీతం తీసుకుంటే.. సగం రోజులు పూర్తి కాకుండానే మళ్లీ ఒకటో తేదీ కోసం ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా యువతలో ఇలాంటివి ఎక్కువ చూస్తాం. మీరు సంపాదించిన సంపాదన ఓ ప్లాన్ ప్రకారం ఖర్చు చేస్తే తప్పకుండా పొదుపు అవుతుందని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఎంత సంపాదించామనే దానికంటే కూడా దానిని ఎలా వినియోగిస్తున్నాం అనేది చాలా ముఖ్యం అంటున్నారు. కొత్తగా సంపాదన ప్రారంభించి భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించుకునేవారు ఏమి చేస్తే డబ్బులు పొదుపు చేయవచ్చో తెలుసుకుందాం.. సంపాదించిన ప్రారంభ నెలల్లో పెద్ద పెద్ద ఖర్చులకు దూరంగా ఉండాలి. మనకు వస్తున్న ఆదాయం ఎలా ఖర్చవుతుందో కొన్ని నెలల పాటు అబ్జర్వ్ చేయాలి, అద్దె ఎంత చెల్లిస్తున్నాం, ఫోన్ నిర్వహణకు, భోజనం, ప్రయాణం.. ఇలా నిత్యావసరాలకు ఎంత ఖర్చవుతోందనేది అంచనా వేసుకోవాలి. రెగ్యులర్‌ అవసరాలు కాకుండా ఇంకా దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామో తెలుసుకోవాలి. ప్రారంభంలోనే ఎక్కువ ఖర్చు పెట్టి విలాసవంతమైన వస్తువులు కొనడానికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

మన దగ్గర ఉన్న డబ్బలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకోవాలి. ఏది అవసరం.. ఏది అనవసరం అనేది ముందుగా డిసైట్ చేసుకోవాలి. నెలవారీ ఖర్చులుపోనూ మిగిలిన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారనేది గమనంలో పెట్టుకోవాలి. మనకు వస్తున్న ఆదాయాన్ని సరిగ్గా ఖర్చ పెట్టడం, ఓ రకంగా చెప్పాలంటే డబ్బు నిర్వహణ అనేది ఒక నైపుణ్యం. ఎప్పటికప్పుడు కొత్త ఖర్చులు వస్తూనే ఉంటాయి. వాటన్నింటికి మన దగ్గర ఉన్న డబ్బు సరిపోయేలా చూసుకోవాలి. బ్యాంకు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ ఎంతో తరచూ చెక్‌ చేసుకుంటుండాలి. నెలమొత్తానికి అవి సరిపోయేలా చూసుకోవాలి. మీ దగ్గర మిగిలి ఉన్న సొమ్ముకు అనుగుణంగా ఖర్చులు ఉండాలంటున్నారు నిపుణులు.

యువత చాలా మందిలో బద్దకం అనే సమస్య ఉంటుంది. దీంతో నెలవారీ అద్దె, కరెంట్ బిల్లుతో పాటు, మరికొన్ని బిల్లుల చెల్లింపును ఆలస్యం చేస్తూ ఉంటారు. అందుకే కొన్ని బిల్లులకు ఆటోపే ఆప్షన్‌ ఉంటుంది. దానిని సెట్‌ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదంటున్నారు. సంపాదన ప్రారంభించిన యువత వెంటనే క్రెడిట్ కార్డు వంటివి వాడకూడదు. అత్యవసరమైతేనే క్రెడిట్‌ కార్డు తీసుకోవాలంటున్నారు. ఓ వ్యక్తి తనకు వచ్చే సంపాదనలో భవిష్యత్తు అవసరాల కోసం కొంత పొదుపు చేయడాన్ని తప్పనిసరి చేసుకోవాలి. అలా చేయడం ద్వారా భవిష్యత్తులో అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాలకు మన దగ్గర పొదుపు చేసుకున్న మొత్తం ఉపయోగపడుతుంది. అలాకాదని నిర్లక్ష్యం చేస్తే.. అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటందున్నారు నిపుణులు. యువత సాధారణంగా అనవసర ఖర్చలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే మనం పెట్టే ఖర్చు దేనికోసం చేస్తున్నాం. దానివల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటనేది ముందుగా డిసైడ్ అయితే అనవసర ఖర్చును నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..