Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంది..మన్మోహన్‌పై నితిన్ గడ్కారీ ప్రశంసల జల్లు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై కేంద్ర రహదారులు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ సింగ్‌కు దేశం రుణపడి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిపై బీజేపీ సీనియర్ నేత గడ్కరీ..

Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంది..మన్మోహన్‌పై నితిన్ గడ్కారీ ప్రశంసల జల్లు
Nitin Gadkari
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 09, 2022 | 12:05 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై కేంద్ర రహదారులు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ సింగ్‌కు దేశం రుణపడి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిపై బీజేపీ సీనియర్ నేత గడ్కరీ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది. 1991లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశానికి నూతన దిశానిర్దేశం చేశాయని గడ్కరీ ప్రశంసించారు. దివాలా స్థితి నుంచి ఆర్థికంగా పునరుజ్జీవన స్థితికి దేశం రావడానికి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక విధానాలే కారణమన్నారు. మన్మోహన్ సింగ్ ప్రారంభించిన నూతన ఆర్థిక విధానాలతో భారత్ లిబరల్ ఎకానమీగా రూపొందిందని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. లిబరల్ ఎకనమిక్ పాలసీల ద్వారా లభించిన ప్రయోజనాలు పేదలకు, రైతులకు అందాయన్నారు. ఈ విధానాలను ప్రారంభించిన మన్మోహన్ సింగ్‌కు దేశం రుణపడి ఉందన్నారు. లిబరల్ ఎకనమిక్ విధానాల కారణంగా మహారాష్ట్ర మంత్రిగా తాను కూడా రోడ్ల నిర్మాణానికి నిధులను సేకరించగలిగానని తెలిపారు. ఈ ఉదారవాద ఆర్థిక విధానాలతో ప్రయోజనం పొందిన దేశాల్లో చైనా కూడా ఒకటని గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ట్యాక్స్ ఇండియా ఆన్ లైన్ అనే పోర్టల్ నిర్వహించిన అవార్డుల ప్రదానం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశ అభివృద్ధికైనా ఆ దేశ ఆర్థిక సంస్కరణలు, విధానాలే కారణమన్నారు. భారత్ లో ఆర్థిక వ్యవస్థను మరింత పరుగులు పెట్టించాలంటే దేశానికి క్యాపెక్ట్ పెట్టుబడి అవసరం అని గడ్కరీ తెలిపారు.

Manmohan Singh

Manmohan Singh

ఉదారవాద ఆర్థిక విధానం రైతులు, పేద ప్రజలకోసమని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ఆర్థిక విధానం ఒక దేశాన్ని అభివృద్ధి దిశగా ఎలా తీసుకుపోతుందో చెప్పడానికి చైనా పెద్ద ఉదాహరణ అని తెలిపారు. ప్రస్తుతం తన శాఖ దేశ వ్యాప్తంగా 26 గ్రీన్ ఎక్స్ ప్రెస్ వేలను నిర్మిస్తోందని.. తమకు నిధుల కొరత లేదని తెలిపారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆదాయం ఏడాదికి రూ. 40 వేల కోట్లుగా ఉందని… 2024 చివరికల్లా ఇది రూ.1.40 కోట్లకు చేరుకుంటుందని అన్నారు.మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రత్యర్థి పక్షంపై బహిరంగంగా ప్రశంసలు కురిపిచడం వంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..