Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips: ప్రయాణ సమయాల్లో వాంతులు ఎందుకు అవుతాయి.. ఈ సమస్యను ఎలా నివారించవచ్చంటే..

ప్రయాణ సమయాల్లో చాలా మందికి వాంతులు అవుతూ ఉంటాయి. కొంతమందికి బస్సు ప్రయాణంలో ఈ సమస్య ఎదురైతే.. మరికొంతమందికి కారు ప్రయాణంలో ఎదురవుతుంది. ఎక్కువుగా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తల తిరగడం, వాంతులు అవుతుంటాయి. రైలు, కారు, ఆటో..

Travel Tips: ప్రయాణ సమయాల్లో వాంతులు ఎందుకు అవుతాయి.. ఈ సమస్యను ఎలా నివారించవచ్చంటే..
Motion Sickness
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 09, 2022 | 8:26 AM

ప్రయాణ సమయాల్లో చాలా మందికి వాంతులు అవుతూ ఉంటాయి. కొంతమందికి బస్సు ప్రయాణంలో ఈ సమస్య ఎదురైతే.. మరికొంతమందికి కారు ప్రయాణంలో ఎదురవుతుంది. ఎక్కువుగా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు తల తిరగడం, వాంతులు అవుతుంటాయి. రైలు, కారు, ఆటో, విమానం ఇలా ఏ ప్రయాణంలో అయినా వాంతులు అవుతూ ఉంటాయి. అయితే ఒక్కోకరికి ఈ సమస్య ఒకో రకంగా ఉంటుంది. ప్రయాణ సమయాల్లో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్ సికె నెస్ అని అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.. అయితే అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ప్రయాణం మొదలుకాగానే ప్రభావం కనిపిస్తుంది. మరి కొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత, ఎగుడుదిగుడు రోడ్లు, ఘాట్ రోడ్డు ప్రయాణం, వాహనంలో వాసనలు వలన వాంతులు వస్తాయి. మోషన్ సిక్ నెస్ సమస్య ప్రధానంగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లోనూ, మహిళల్లో ఎక్కువుగా కనిపిస్తుంది. పురుషుల్లోనూ ఈ సమస్య ఉన్నప్పటికి.. మహిళలతో పోలిస్తే మగవారిలో తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ సమస్య జన్యు పరంగా కూడా ఏర్పడుతుంది. మహిళల్లో నెలసరి సమయంలో, గర్భిణులకు, మైగ్రేన్, పార్కిన్‌సన్ వ్యాధి ఉన్నవాళ్లకు ప్రయాణంలో వాంతులు వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. బస్సు ప్రయాణం మాత్రమే కాకుండా ఏ ప్రయాణంలో అయినా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ మోషన్ సిక్‌నెస్‌కు కార్‌ సిక్‌నెస్‌, సీ సిక్‌నెస్‌, ఎయిర్ సిక్‌నెస్‌ ఇలా అనేక రకాల పేర్లు ఉన్నాయి. కొందరికి ద్విచక్ర వాహనం పై వెళ్లేటప్పుడు కూడా వాంతులు అవుతాయి.

మోషన్ సిక్‌నెస్‌కు కారణం

ప్రయాణ సమయాల్లో తలతిరగడం, వాంతులకు ప్రధాన కారణం చెవిలో ఉండే లాబ్రింథైస్ అనే భాగమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ భాగం శుభ్రంగా లేకపోయినా, ఇది ఉన్న పరిస్థితుల్లో చిన్న మార్పు కలిగినా ప్రయాణంలో వాంతులు అవుతాయి. ప్రతి రోజూ స్నానం చేయకపోవడం, సబ్బుతో లేదా ఏవైనా క్రీములతో ముఖం శుభ్రం చేసుకునేటప్పుడు చెవుల్లో చేరే నురగను శుభ్రం చేసుకోకపోవడం, చెవిలో నూనె వేయడం, ఏదైనా వస్తువతో చెవులలో పదేపదే తిప్పడం వలన లాంబ్రింథైస్ వద్ద సమతాస్థితి దెబ్బతిని.. మోషన్ సిక్‌నెస్‌కు కారణమవుతుంది. చెవి లోపల భాగం గదులుగా ఉండి ద్రవంతో నిండి ఉంటుంది. కోక్లియా, వెస్టిబ్యూల్ , అర్ధ వృత్తవలయాలు అనే మూడు ప్రధాన భాగాలుగా ఇది ఉంటుంది. కోక్లియా అనేది చెవిని తాకే శబ్ధాలను నాడీ సంకేతాలుగా మార్చి మెదడులోనికి తీసుకుని వెళ్తుంది. కోక్లియా వద్దే లాబ్రింథైస్ ఉంటుంది. ఈ రెండిటిని కలిపి కోక్లియా లాబ్రింథైస్ అని అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యవస్థ మన చుట్టూ జరిగే శభ్దాలను గుర్తించడంలో సహాయ పడుతుంది. ఇది చాలా సున్నితమైన వ్యవస్థ. ఈ భాగం అపరిశుభ్రంగా ఉన్నా, ఉండవలసిన స్థితిలో ఉండకపోయినా.. మెదడుకు అందవలసిన సంకేతాలు సరిగా అందడు.. దీంతో ముందు తలతిరగడం తర్వాత వికారంగా అనిపించడం, వాంతులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో వివిధ వేగంగా ప్రయాణించడం, ఒకే స్థితిలో కాకుండా పైకి, కిందకు, లేదా రోడ్లపై ఉన్న గుంతల వలన చెవిలోని కోక్లియా లాబ్రింథైస్ వ్యవస్థపై ప్రభావం పడి వాంతులు కావడానికి కారణం కావచ్చు. విమాన ప్రయాణాల్లో ఎయిర్ టర్బులెన్స్ వలన ఇదే సమస్య ఏర్పడుతుందని అంటున్నారు వైద్య నిపుణులు.

ప్రయాణాల్లో వాంతులు అయ్యే సమయంలో ఏం చేయాలి..

ప్రయాణాల్లో వాంతులు వస్తే ముందుగా చేతులతో చెవులు మూస్తారు. అలాగే తలపై నోటితో గాలి ఊదుతారు. వాంతులు సమయంలో చెవులు మూయడం వలన బయట నుంచి చెవుల్లోపలికి గాలి వెళ్లనీయకుండా చేసి…చెవిలోపలి వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరగకుండా చూస్తుంది. దీనివల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉందంటున్నారు వైద్య నిపుణులు. ప్రయాణాల్లో వాంతులు వస్తాయనే అనుమానం ఉన్నవాళ్లు నిమ్మకాయ పట్టుకుని వెళ్తారు. నిమ్మకాయలో ఎసిడిక్ యాసిడ్స్ ఉండటం వలన ఇది కూడా ఉపశమనం కలిగిస్తుంది. కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ ఉండే అల్లం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. ఈ సమస్య ప్రాణాంతకం కానప్పటికి.. అనారోగ్య సమస్యని చెబుతున్నారు వైద్యులు. ప్రయాణంలో ఉండగా వాంతులవుతున్నట్లు అనిపిస్తే…కుడి లేదా ఎడమ చేతి బొటన వేలు కింద చివర భాగం, మణికట్లు కలిసే చోట ఎడమ లేదా కుడి చేతితో నొక్కిపట్టుకోవడం లేదా మెల్లగా నొక్కడం వల్ల ఉపశమనం తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు. మోషన్ సిక్‌నెస్‌ సమస్య ఉన్నవాళ్లు వాహనం ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో కూర్చోకూడదు. ప్రయాణంలో చదవకూడదు. అన్నింటి కంటే ముందు ప్రయాణం సందర్భంగా వాంతులు అనే అంశాన్ని మన మెదడులోకి రాకుండా చూసుకోవడం కూడా మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

నోట్: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..