AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shirdi: షిర్డి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ దర్శన భాగ్యం అందరికి..

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబ దర్శనానికి వెళ్లే భక్తులకు సాయి సంస్థాన్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. షిర్డీ వెళ్లే భక్తులు సాయిబాబా దర్శనం చేసుకోవడంతో ఆమర సమాధిని స్పృశించే భాగ్యాన్ని భక్తులు తిరిగి పొందనున్నారు. గతంలో ప్రతి..

Shirdi: షిర్డి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ దర్శన భాగ్యం అందరికి..
Shirdi Sai Baba
Amarnadh Daneti
|

Updated on: Nov 11, 2022 | 9:25 AM

Share

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబ దర్శనానికి వెళ్లే భక్తులకు సాయి సంస్థాన్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. షిర్డీ వెళ్లే భక్తులు సాయిబాబా దర్శనం చేసుకోవడంతో ఆమర సమాధిని స్పృశించే భాగ్యాన్ని భక్తులు తిరిగి పొందనున్నారు. గతంలో ప్రతి భక్తుడికి సాయిబాబా దర్శనంతో పాటు సమాధిని తాకే అవకాశం ఉండేది. భక్తుల తీవ్ర రద్దీ నేపథ్యంలో షిర్డీ సాయి సంస్థాన్‌ పలు మార్పులు చేసింది. భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టింది. వీఐపీ భక్తులు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అవకాశం కల్పించింది. సాధారణ భక్తులు దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం సామాన్య భక్తులకు సైతం సాయి సమాధిని తాకే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సాయి సంస్థాన్‌ బోర్డు ప్రకటించింది. ఆలయ ట్రస్టు బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై సాయిబాబా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు, షిర్డీ గ్రామస్తుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సాయి సంస్థాన్ అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది.

షిర్డీ గ్రామస్తులు, సాయిబాబా సంస్థాన్ నిర్వాహకుల మధ్య జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. వీటిలో సాయిబాబా సమాధిని స్పృశించే భాగ్యాన్ని భక్తులందరికి కల్పించడం కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. గతంలో సాయిబాబా సమాధి ముందు గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టడంతో భక్తులు సమాధిని తాకలేక అసంతృప్తితోనే బాబా దర్శనం చేసుకుని వెళ్లేవారు. సాయిబాబా దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. వారంతా బాబా సమాధిని తాకాలనే ఆశతో వస్తుంటారు. అటువంటి వారికి షిర్డీ సాయి సంస్థాన్ నిర్ణయం ఆనందం కలిగించే విషయం కానుంది.

షిర్డీ గ్రామస్తులు, సాయి సంస్థాన్ మధ్య జరిగిన సమావేశంలో సమాధి ముందున్న అద్దాలు, మెష్ తొలగించడంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సాయి ఆరతి జరుగుతున్నప్పుడు భక్తులు గురుస్థాన్ ఆలయానికి ప్రదక్షిణలు చేయవచ్చు. భక్తుల రద్దీ ఎక్కువుగా ఉన్నప్పుడు తక్కువ ఎత్తులో ఉన్న అద్దాలు అమర్చడం, ద్వారకామాయి గుడిలోకి లోపలి నుంచి భక్తులను అనుమతించడం వంటి నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం చూడండి..