Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేడు అందుబాటులోకి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే?
డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన మొత్తం టికెట్లన్నీ భక్తులకు అందుబాటులో ఉంచనున్నది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ (నవంబర్11) విడుదల చేయనుంది. డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన మొత్తం టికెట్లన్నీ భక్తులకు అందుబాటులో ఉంచనున్నది. కాగా, వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పుల కారణంగా డిసెంబర్ నెల కోటా టికెట్ల విడుదల ఆలస్యమైందని టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తలు టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి స్లాట్ ఓపెన్ కానుందన్నారు. ఏడాది ముగింపు కావడంతో ఉద్యోగులు సెలవులు ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, అవసరమైన వారు ముందుగానే దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
ఎలా బుక్ చేసుకోవాలంటే..
రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. పేరు తదితర వివరాలతో రిజిష్టర్ చేసుకోవాలి. లేదూ ముందుగానే రిజిస్టర్ చేసుకుని ఉంటే లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లేటెస్ట్ అప్‌డేట్స్‌లో ఉండే రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లపై క్లిక్ చేయాలి. ఆపై మీకు కావాల్సిన తేదీ, సమయాన్ని సెలెక్ట్ చేసుకుని అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు వచ్చింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..