Horoscope Today: వీరికి అదృష్టం వెన్నంటే.. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఈ రాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. అనుకూల ఫలితాలను అందుకుంటారు. కొన్ని పనులు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆంజనేయస్వామిని దర్శించుకుంటే మేలు కలుగుతుంది.
మేషం
కీలక, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దల సూచనలు అవసరం. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. బద్ధకాన్ని వదిలేయండి. నవగ్రహ శ్లోకం పఠిస్తే మంచిది.
వృషభం
విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విరోధులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది.
మిథునం
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. పెద్దల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు అందుకుంటారు. పెద్దల సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
కర్కాటకం
మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నత అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన మాత్రం మరవద్దు.
సింహం
ఈ రాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. అనుకూల ఫలితాలను అందుకుంటారు. కొన్ని పనులు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆంజనేయస్వామిని దర్శించుకుంటే మేలు కలుగుతుంది.
కన్య
మిత్రుల సహకారంతో మేలు జరుగుతుంది. శ్రమాధిక్యం అవుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది.
తుల
చేపట్టిన పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన మనసుకు బాధ కలిగిస్తుంది. కొన్ని విషయాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. గోసేవ చేస్తే మంచి చేకూరుతుంది.
వృశ్చికం
ఈ రాశివారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలు పొందుతారు. శత్రువుల విషయంలో పైచేయి సాధిస్తారు. ప్రయాణాల లాభిస్తాయి. హనుమంతుడిని దర్శించుకుంటే మంచిది.
ధనస్సు
కీలక రంగాల్లో తోటివారి సహకారాలు లాభిస్తాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి దేవుడిని పూజిస్తే మంచిది.
మకరం
మనోబలమే ఆయుధంగా ముందుకు సాగాలి. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాల్లో మొహమాటం, దాపరికాలు వదిలి పెట్టడం మేలు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది.
కుంభం
కీలక వ్యవహారాల్లో పెద్దలు, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. పొదుపు పాటించాలి. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా, సహనంతో వ్యవహరించండి. శివనామాన్ని జపించడం వల్ల మేలు చేకూరుతుంది.
మీనం
కీలక పనుల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. దాపరికం, మొహమాటాన్ని దరిచేరనీయకండి. బంధువులతో కలహ సూచనలు. ప్రయాణాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.