AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: కుమార్తెకు శ్రీకృష్ణుడితో వివాహం.. ఆశ్చర్యపోయిన బంధువులు.. ఏమైందంటే..

తమ పిల్లల ఆనందం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు తల్లిదండ్రులు.. తమ స్థాయినిబట్టి పిల్లలను అపురూపంగా చూసుకుంటారు. వారి కళలను నెరవేర్చడం కోసం తమ వంతు కృషి చేస్తారు పేరెంట్స్..తాజాగా మధ్యప్రదేశ్ లో తన..

Funny Video: కుమార్తెకు శ్రీకృష్ణుడితో వివాహం.. ఆశ్చర్యపోయిన బంధువులు.. ఏమైందంటే..
Lord Krishna Brings Procession to Marry Girl in Madhya Pradesh
Amarnadh Daneti
|

Updated on: Nov 11, 2022 | 8:49 AM

Share

తమ పిల్లల ఆనందం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు తల్లిదండ్రులు.. తమ స్థాయినిబట్టి పిల్లలను అపురూపంగా చూసుకుంటారు. వారి కళలను నెరవేర్చడం కోసం తమ వంతు కృషి చేస్తారు పేరెంట్స్..తాజాగా మధ్యప్రదేశ్ లో తన కుమార్తె ఆనందం కోసం ఓ తండ్రి చేసిన పని తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశారనుకుంటున్నారా.. తన కుమార్తెకు పెళ్లి చేశాడు.. అదేంటి పెళ్లి చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏముందిలే అనుకుంటే పొరపాటే.. ఆ తండ్రి తన కుమార్తెకు శ్రీకృష్ణుడితో పెళ్లి చేశాడు. పెళ్లి కోసం బంధువులను సైతం పిలిచాడు. వారికి కూడా తన కుమార్తెకు శ్రీ కృష్ణుడితో వివాహం అని చెప్తే .. వారంతా ఆశ్చర్యపోయారు. తీరా వెళ్లిన తర్వాత చూస్తే అప్పుడు తెలిసింది అసలు సంగతి. అనారోగ్యం కారణంగా బెడ్ రెస్ట్ కే పరిమితమైన తన కుమార్తె కోరికను తీర్చేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమార్తెకు గ్వాలియర్‌లో శ్రీకృష్ణుడితో ఘనంగా వివాహం జరిపించాడు. శిశుపాల్ రాథోడ్ అనే వ్యాపారవేత్త తన దివ్యాంగురాలైన కుమార్తెను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించడం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన ఆ యువతి మాట్లాడలేదు, చెవులు కూడా వినపడవు. దీంతో ఆమెకు వివాహం కావడం కష్టంగా మారింది. కుమార్తెను సంతోషపెట్టేందుకు శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయాలని శిశుపాల్ నిర్ణయించుకున్నారు. బంధువులకు ఫోన్‌ చేసి తన కుమార్తె పెళ్లి ఉందని ఆహ్వానించారు. శ్రీకృష్ణుడితో వివాహం జరిపిస్తున్నారని తెలిసి బంధువులంతా ఆశ్చర్యపోయారు. ఈ పెళ్లిని శిశుపాల్‌ ఘనంగా నిర్వహించారు. నిజంగా అన్ని పెళ్లి వేడుకలు ఎలా చేస్తారో.. అలాగే అన్ని ఏర్పాట్లు చేశారు. మెహందీ, విందు, ఊరేగింపు సైతం నిర్వహించారు. గుడిలో నిర్వహించిన ఈ పెళ్లి వేడుకలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ఓ యువతి, వధువు పూలదండలు మార్చుకోగా బంధుమిత్రులు ఆశీర్వదించారు. కేవలం తన కుమార్తె సంతోషం కోసం ఇలా చేశానని శిశుపాల్ వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త శిశుపాల్ రాథోడ్ కుమార్తె సోనాల్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. నరాల సంబంధిత రుగ్మతతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉంది. పెళ్లి వయసు రావడంతో అందరు ఆడపిల్లల్లాగే పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెతో పెళ్లికి ఎవరూ ముందుకురావడం లేదు. చికిత్స అందిస్తున్నప్పటికి ఆమె ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో తన తండ్రి ఎంతో బాధపడ్డాడు. దీంతో తనకు పెళ్లి వేడుక జరిపించాలని నిర్ణయించుకుని.. సాధారణంగా వివాహలు ఎంత వైభవంగా నిర్వహిస్తారో అంతే వైభవంగా వేడుక నిర్వహించాడు.

ఇవి కూడా చదవండి

కుమార్తె సోనాల్ సంతోషం కోసం నవంబర్ 7వ తేదీన శ్రీకృష్ణుడితో ఆమె వివాహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని, సాధారణ పెళ్లిలాగే.. ఒక రోజు ముందుగా శుభకార్యానికి హాజరు కావాలని బంధువులకు ఆహ్వానాలు పంపించాడు శిశుపాల్. దివ్యాంగురాలిని వివాహం చేసుకోవడానికి అంగీకరించిన వరుడు ఎవరని బంధువులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇంతలో సోనాల్‌ను పెళ్లి చేసుకోవడానికి కన్హయ్య బృందావన్ నుండి వచ్చాడంటూ బంధువులకు తెలిపింది. దీంతో ఓ మహిళకు శ్రీకృష్ణుడి వేషధారణ ధరించి శిశుపాల్ తన కుమార్తె వివాహం జరిపించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..