విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం..అసలు సూత్రదారుల వేటలో పోలీసులు..

విమానాశ్రయానికి పెద్ద ఎత్తున నిషిద్ధ వస్తువులు తరలిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగారు కస్టమ్స్ అధికారులు. అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రదారులు ఎవరూ అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో విస్తృత దర్యాప్తు చేస్తున్నారు.

విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం..అసలు సూత్రదారుల వేటలో పోలీసులు..
Gold
Follow us

|

Updated on: Nov 30, 2022 | 7:00 AM

చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం, నగదు సీజ్‌ పట్టుబడింది. దుబాయ్, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద గుర్తించిన రూ. 37 లక్షల విలువైన బంగారం-విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఎయిర్‌పోర్టు అధికారులు. మీనంబాక్కం, చెన్నై మీనంబాక్కం విమానాశ్రయానికి పెద్ద ఎత్తున నిషిద్ధ వస్తువులు తరలిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగారు. కస్టమ్స్ శాఖ అధికారులు విమాన ప్రయాణికులను నిశితంగా పరిశీలించారు. ఆ సమయంలో దుబాయ్ నుంచి విమానంలో వెళ్తున్న చెన్నైకి చెందిన యువకుడు అనుమానాస్పదంగా కనిపించటంతో ఆపి విచారించారు.

వెంటన తెచ్చుకున్న బ్యాగుల్లో ఎటువంటి నిషిద్ధ వస్తువులు కనిపించలేదు. కానీ,అనుమానంతో అతన్ని ఓ ప్రైవేట్ గదిలోకి తీసుకెళ్లి సోదాలు చేయగా లోదుస్తుల్లో బంగారాన్ని దాచి ఉంచినట్లు గుర్తించారు. దీంతో కస్టమ్స్ అధికారులు రూ.25 లక్షల 47 వేల విలువైన 541 గ్రాముల బరువున్న బంగారు కడ్డీని స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని అరెస్ట్‌ చేశారు. అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రదారులు ఎవరూ అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో విస్తృత దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Gold Seized

అదేవిధంగా చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ వెళ్లే విమానం ఎక్కిన ప్రయాణికుల వస్తువులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. చెన్నైకి చెందిన యువకుడి వస్తువులను సోదా చేయగా.. సూట్‌కేస్‌లోని బట్టల మధ్య అమెరికా డాలర్లను దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం అతడి నుంచి రూ.12 లక్షల 33 వేల విలువైన అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సింగపూర్ వెళ్లాల్సిన యువకుడి విమానాన్ని రద్దు చేసిన అధికారులు.. డాలర్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..