AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loudspeakers Controversy: మరోసారి తెరపైకి వచ్చిన లౌడ్ స్పీకర్ వివాదం.. ప్రభుత్వాదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదన్న ప్రముఖ హిందూ సంస్థ..

అలీఘర్‌లోని స్థానిక మసీదుల మీద ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల కారణంగా తమకు అంతరాయం కలుగుతుందంటూ.. ప్రముఖ హిందూ సంస్థ బజరంగ్ దళ్  జిల్లా అధికార యంత్రాంగానికి వినతిపత్రం అందించింది. ఇంకా యోగి..

Loudspeakers Controversy: మరోసారి తెరపైకి వచ్చిన లౌడ్ స్పీకర్ వివాదం.. ప్రభుత్వాదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదన్న ప్రముఖ హిందూ సంస్థ..
Aligarh Protest
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 30, 2022 | 7:14 AM

Share

అలీఘర్‌లో మరోసారి లౌడ్ స్పీకర్ వివాదం తెరమీదకు వచ్చింది. అలీఘర్‌లోని స్థానిక మసీదుల మీద ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల కారణంగా తమకు అంతరాయం కలుగుతుందంటూ.. ప్రముఖ హిందూ సంస్థ బజరంగ్ దళ్  జిల్లా అధికార యంత్రాంగానికి వినతిపత్రం అందించింది. ఇంకా యోగి ప్రభుత్వ ఆదేశాలను జిల్లా యంత్రాంగం పాటించడం లేదని వారు ఆరోపించారు. దీంతో మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల నుంచి అజాన్ శబ్దం నిరంతరం పెరుగుతోందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో భజరంగ్ దళ్ ఆఫీస్ బేరర్ గౌరవ్ శర్మ మాట్లాడుతూ ‘‘ఏ మతపరమైన ప్రదేశంలో అయినా.. ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల కారణంగా శబ్దం బయటకు వెళ్లకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టు, యోగి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి. కానీ, అలీగఢ్‌లో 2 నుంచి 3 కిలోమీటర్లలోపు మసీదు లేదు. అయినప్పటికీ, ఆజాన్ శబ్దం ఉదయం, సాయంత్రం వేళల్లో బాగా ప్రతిధ్వనిస్తుంది. దీనిపై అధికార యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.

అజాన్ శబ్దాన్ని ఆపమంటూ పోలీసుల వద్దకు..

మసీదులపై ఉన్న లౌడ్ స్పీకర్ల గురించి వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మసీదుకు చెందినవారు లౌడ్ స్పీకర్లును తొలగిస్తామని హామీ ఇచ్చారు కానీ అజాన్ శబ్దం ఆగలేదన్నారు. అందుకే ఆజాన్ శబ్దాన్ని పూర్తిగా ఆపడానికి మొత్తం హిందూ సమాజం తరపున.. బజరంగ్ బల్ ప్రతినిధిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని కలవడానికి వచ్చిందనని సంస్థ నాయకులు  తెలిపారు.

లౌడ్ స్పీకర్ల విషయంలో పాలకులపై నమ్మకం..

ప్రజలకు అవాంతరం కలిగిస్తున్న ఈ ఆజాన్‌ శబ్దాన్ని ఆపివేస్తుందన్న నమ్మకం మాకు యోగి ప్రభుత్వం మీద ఉందన్నారు భజరంగ్ దళ్ నాయకులు. అయితే ఇప్పటివరకు చూస్తున్నదాని ప్రకారం, అలీఘర్ జిల్లా యంత్రాంగం యోగి ప్రభుత్వ ఆదేశాలను పూర్తిగా విస్మరించి, వాటిని ఉల్లంఘించేలా ప్రవర్తిస్తోందని వారు ఆరోపించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగానే జిల్లా యంత్రాంగం హడావుడిగా దాదాపు 9000 స్పీకర్లను తొలగించింది. తరువాత సౌండ్ రావడం ఆగిపోవడంతో ప్రజలు కూడా సంతోషించారు. కానీ  ప్రస్తుత కాలంలో మరోసారి లౌడ్ స్పీకర్ నుంచి ఆజాన్ శబ్దం రావడం ప్రారంభం అయింది. దాని  కారణంగా ప్రజలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు’’ అని భజరంగ్ దళ్ నాయకుడు హరి తెలిపారు.

ఇవి కూడా చదవండి

జిల్లా మెజిస్ట్రేట్‌కు వినతి పత్రం..

లౌడ్ స్పీకర్ల సమస్య నేపథ్యంలో పోలీసులకు వినతి పత్రం అందించామని బజరంగ్ దళ్ హరి తెలిపారు. వినతి పత్రంలో..  సుప్రీంకోర్టు, హైకోర్టు, యూపీ ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ మసీదులపై లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసిన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని దళ్ నాయకులు పేర్కొన్నారు. ఆ వినతిపత్రం ఆధారంగా అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెప్పారు. అదే సమయంలో అనేకమంది బజరంగ్ దళ్ కార్యకర్తలు జిల్లా ప్రధాన కార్యాలయానికి వెళ్లి.. అక్కడ జిల్లా మేజిస్ట్రేట్‌కు కూడా మెమోరాండం అందించారు.  వెనువెంటనే లౌడ్ స్పీకర్ల సమస్యను పరిష్కరించాలని జిల్లా మెజిస్ట్రేట్‌ను వారు కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..