AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ban Over PFI: ఆ నిషేధిత సంస్థ రిట్ పిటీషన్‌పై నేడే తుది తీర్పు.. వెల్లడించనున్న కర్ణాటక హై కోర్టు..

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రముఖ రాజకీయ సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) సంస్థను భారత ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధించింది. అయితే పీఎఫ్‌ఐ నిషేధంపై కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ..

Ban Over PFI: ఆ నిషేధిత సంస్థ రిట్ పిటీషన్‌పై నేడే తుది తీర్పు.. వెల్లడించనున్న కర్ణాటక హై కోర్టు..
Pfi And Karnataka High Cour
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 30, 2022 | 6:41 AM

Share

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రముఖ రాజకీయ సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) సంస్థను భారత ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధించింది. అయితే పీఎఫ్‌ఐ నిషేధంపై కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ.. ఆ సంస్థ అధ్యక్షుడు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు సింగిల్ మెంబర్ బెంచ్ బుధవారం(నవంబర్ 30) తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కర్ణాటక పీఎఫ్‌ఐ అధ్యక్షుడు నసీర్ అలీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను నవంబర్ 28న విచారించిన హైకోర్టు.. తీర్పును నవంబర్ 30కి రిజర్వ్ చేసింది. ఈ మేరకు పీఎఫ్‌ఐ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్‌పై తాజా తీర్పు వెలువడనుంది. పిటిషనర్‌ తరఫున వాదించిన న్యాయవాది జయకుమార్‌  ఎస్‌.పాటిల్‌ ‘‘పిఎఫ్‌ఐను చట్టవిరుద్ధమైన సంస్థ అని ప్రకటించారు.

అయితే పీఎఫ్‌ఐ చట్టవిరుద్ధమైన సంస్థ కావడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కారణం చెప్పలేదు. తక్షణ నిషేధానికి ప్రత్యేక కారణం తప్పనిసరిగా చెప్పాలి. వాదనకు సమయం ఇవ్వకుండా  సంస్థను నిషేధించారు. యూఏపీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉత్తర్వులు జారీ చేశార’’ని ఆయన వాదించారు.కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. పీఎఫ్‌ఐ సంస్థ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, దేశంలో హింసాత్మక చర్యలకు పూనుకుంటుందన్నారు. అందుకే పీఎఫ్‌ఐ సంస్థపై ఆంక్షలు విధించినట్లు కోర్టుకు తెలిపారు.

పీఎఫ్ఐపై ఎందుకు నిషేధం..?

ఇవి కూడా చదవండి

కొన్ని నెలల క్రితం, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఏకకాలంలో దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( PFI ) సంస్థపై దాడి చేసింది. ఆ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు, దేశ విధ్వంసానికి కుట్ర, తీవ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాల ఆరోపణలపై పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.

ఆ తరువాత ఆ సంస్థను సెప్టెంబర్ 28న కేంద్రప్రభుత్వం 5 సంవత్సరాల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద పీఎఫ్ఐ, దానిక అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్ఐ అనుబంధ సంస్థలైన రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఐఎఫ్), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఏఐఐసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌సీహెచ్ఓ), నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్ వంటి పలు సంస్థలు ఈ ఉత్తర్వులలో భాగంగా నిషేధానికి గురయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..