AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాసిపెట్టుకోండి.! ఉగాది ముందే వీరికి డబ్బే డబ్బు.. సోమవారం 12 రాశిఫలాలు ఇలా

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవ హారాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.

Horoscope Today: రాసిపెట్టుకోండి.! ఉగాది ముందే వీరికి డబ్బే డబ్బు.. సోమవారం 12 రాశిఫలాలు ఇలా
Daily Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 16, 2026 | 6:52 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా చాలా వరకు సఫలం అయ్యే అవకాశం ఉంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణి స్తారు. ఉద్యోగ జీవితం సాఫీగా గడిచిపోతుంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు, లక్ష్యాలు అప్పగించే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని రంగాల వారికి సమయం లాభదాయకంగా ఉంది. చిన్ననాటి స్నేహితు లతో విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రముఖులతో స్నేహాల వల్ల కొన్ని ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశముంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యయ ప్రయాసలతో మీరు చేపట్టిన ప్రతి పనీ పూర్తవుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు, ప్రతిఫలం తప్ప కుండా లభిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యక్తిగత పురోగతి ఉంటుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలు బాగా సంతృప్తి కరంగా సాగిపోతాయి. ఇంటి కోసం విలువైన వస్తు పరికరాలు కొంటారు. ఆరోగ్యం పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవ హారాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. కొద్ది శ్రమతో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలను పాటించడం మంచిది. పని భారం కాస్తంత ఎక్కు వగానే ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎవ రినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపో తుంది. డాక్టర్లు, లాయర్లు, ఇతర వృత్తి నిపుణులు అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపా రాలు నిలకడగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధుమిత్రుల నుంచి బాకీలు వసూలవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. బంధుమిత్రుల నుంచే కాక, కుటుంబ సభ్యుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబం ధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచడం చాలా మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాలపరంగా బాగా బిజీ అవడం జరుగుతుంది. వ్యాపారాల్లో కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలకు తగ్గట్టుగా కొన్ని ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగ స్వామిని కూడా సంప్రదిస్తూ ఉండడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగుల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది. వృత్తి జీవితం చాలావరకు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలలో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలున్నాయి. వ్యయ ప్రయాసలతో కానీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయ్యే అవకాశం ఉండదు. వ్యక్తిగత జీవితంలో బాగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా పరవాలేదనిపిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఒడిదుడుకులు లేకుండా సాగి పోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. శుభ కార్యాలు, పుణ్య కార్యాల మీద కూడా బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. గృహ, వాహనాల కొనుగోలుపై దృష్టి పెడ తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

Follow Us