ఈ వీకెండ్ సినిమా సెట్టు..OTTలో అద్భుతమైన హర్రర్ కామెడీ మూవీ..
కనిమంగళం కోవిలకం, థియేటర్లలో హిట్టయిన మలయాళ హారర్ కామెడీ, ఇప్పుడు సన్ నెక్ట్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. వెబ్ సిరీస్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, హాస్టల్‌లో ఆత్మలతో స్నేహితులు పడే ఇబ్బందులను కామెడీగా చూపిస్తుంది. హారర్ కంటే కామెడీకే ప్రాధాన్యతనిస్తూ, యూత్, ఫ్యామిలీలను ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడాల్సిన వినోదాత్మక చిత్రం ఇది.
‘కనిమంగళం కోవిలకం’. ఇదొక మలయాళ హర్రర్ కామెడీ సినిమా.! థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది! ఈ సినిమా.. ‘కనిమంగళం కోవిలకం’ వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌లో నటించిన అజ్మల్ ఖాన్, అబ్బి క్రిష్, మహమ్మద్ రఫిన్ లే ఈ సినిమాలోనూ యాక్ట్ చేశారు. తమ కామెడీ టైమింగ్ తో అందర్నీ ఇంప్రెస్ చేస్తారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ముగ్గురు స్నేహితులు ఒక పాత హాస్టల్‌లో నివసిస్తుంటారు. ఆ హాస్టల్ పక్కనే ఒక పాత శ్మశాన వాటిక ఉంటుంది. ఆ శ్మశానం నుంచి ఆత్మలు తమ హాస్టల్‌లోకి వస్తున్నాయని భయపడే ఆ ముగ్గురు కుర్రాళ్ళు, ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు,వారు ఎదుర్కొనే ఇబ్బందులు నవ్వులు పూయిస్తాయి. హారర్ ఎలిమెంట్స్ కంటే కామెడీ పైనే సినిమా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. స్నేహితుల మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. సాధారణ హారర్ సినిమాలలా కాకుండా, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా కథనం సాగుతుంది. ప్రస్తుతం సన్ నెక్ట్స్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరూ ఓ లుక్కేయండి!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar: 3వేల కోట్ల వసూళ్లతో.. ఇండియాలోనే ‘నెంబర్ 1’ గా ధురంధర్
V.V. Vinayak: అసలు మహేష్‌ను ఛాన్స్ ఎందుకు అడగాలి ??
Varun Tej: వరుణ్ తేజకు గాయం.. అపోలోలో సర్జరీ !!
Ram Charan: డెకాయిట్‌కు చరణ్ అదిరిపోయే రివ్యూ..
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీలో.. బిగ్ ట్విస్ట్
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

