Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీలో.. బిగ్ ట్విస్ట్
సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ ఆన్‌స్క్రీన్ జోడీగా అభిమానులను అలరించేవారు. ఇటీవల దీపిక పిల్లితో సుధీర్ ఉన్న ఫోటో వైరల్ కావడంతో అంతా షాకయ్యారు. అయితే, ఆ ఫోటో తన ఇన్‌స్టా ఖాతా హ్యాక్ అవ్వడం వల్ల పోస్ట్ అయిన ఏఐ జనరేటెడ్ ఫోటో అని దీపిక స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదానికి తెరపడింది, సుధీర్ మళ్ళీ రష్మితో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
ఎప్పటి నుంచో ఆన్ స్క్రీన్ పై రష్మి గౌతమ్‌తో లవ్ కంటిన్యూ చేస్తున్న సుడిగాలి సుధీర్. తన లవ్ ట్రాక్తో.. బుల్లితెర ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. తనకంటూ క్రేజ్‌ను వచ్చేలా కూడా చేసుకున్నాడు. అయితే ఈ లవ్‌స్టోరీకి చెక్ పెడుతూ సుధీర్ పక్కన దీపిక్ పిల్లి వచ్చి చేరింది. వీరిద్దరూ కాస్త సన్నిహితంగా ఉన్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందర్నీ స్టన్ అయ్యేట్టుగా చేసింది. కట్ చేస్తే ఇప్పుడో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. సుధీర్.. యాంకర్ దీపిక పిల్లితో క్లోజ్‌గా ఉన్న ఫొటో బయటకొచ్చేసరికి అంతా షాకయ్యారు. ఇదసలు ఊహించనేలేదుగా అనుకున్నారు.ఇప్పుడు ఆ వైరల్ ఫొటోపై స్వయంగా దీపిక పిల్లి క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టింది. ‘నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయింది. గతరాత్రి నా స్టోరీలో షేర్ అయింది ‘ఏఐ’ జనరేటెడ్ ఫొటో. నా అనుమతి లేకుండా దాన్ని పోస్ట్ చేశారు. దీన్ని మీరెవరూ షేర్ చేయొద్దు. గత 24 గంటల్లో నా ఖాతాలో పోస్ట్ అయిన ఏ కంటెంట్‌తోనూ నాకు సంబంధం లేదు. దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఈ సమస్యని పరిష్కరించే పనిలో ఉన్నా’ అని దీపిక చెప్పుకొచ్చింది. దీంతో మరో సారి సుధీర్ నెట్టింట వైరల్ అవుతున్నాడు. మళ్లీ రష్మి గౌతమ్ సమేతంగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..
బయటపడిన ఉండవల్లి గుహల రహస్యాలు ఇవే
ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం
గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు
ఎండలు ముదురుతున్నాయ్.. బీ అలర్ట్
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
అనంతపురంలో సిమ్లా యాపిల్స్ సాగు.. ఇదిగో ఇలా..

