AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జున వద్దు.. నా సినిమాలో శ్రీకాంతే కావాలి

నాగార్జున వద్దు.. నా సినిమాలో శ్రీకాంతే కావాలి

Phani CH
|

Updated on: Apr 16, 2026 | 12:43 PM

Share

ఖడ్గం సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, శ్రీకాంత్ పాత్రకు తొలుత నాగార్జునను అనుకున్నారని ఇప్పుడు వెల్లడైంది. అయితే, బడ్జెట్, పాత్రల సమతుల్యత దృష్ట్యా కృష్ణవంశీ నాగార్జునను పక్కన పెట్టి, శ్రీకాంత్‌ను ఎంచుకున్నారని ఆయన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఖడ్గం వెనుకనున్న ఓ కీలక రహస్యం.

కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ఖడ్గం మూవీ అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. ఇప్పటికీ టీవీల్లో టెలీకాస్ట్ అయిన ప్రతీ సారి మంచి టీఆర్పీని తెచ్చుకుంటూ ఉంటుంది. యూట్యూబ్‌లోనూ ఈ మూవీ సీన్స్‌కి సాంగ్స్‌కి.. మంచి రెస్పాన్ వస్తుంటుంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఖడ్గం సినిమాకి వన్‌ ఆఫ్ ది హైలెట్ క్యారెక్టర్ శ్రీకాంత్ క్యారెక్టర్. ఇంటెన్సివ్ లుక్స్‌తో.. కూల్, అండ్ యాంగ్రీ మ్యాన్‌గా కనిపించిన శ్రీకాంత్.. ఈ సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌తో అందర్నీ ఫిదా చేశాడు. అయితే ఈ క్యారెక్టర్‌ కోసం… ముందు శ్రీకాంత్ కాకుండా నాగార్జునను అనుకున్నారట. నిర్మాతల వైపు నుంచి నాగార్జున ను తీసుకోవాలనే సూచన ఈ మూవీ బిగినింగ్‌లో కృష్ణవంశీకి వచ్చిందట. అయితే నాగార్జున లాంటి స్టార్ నటుడిని తీసుకుంటే సినిమాకు మంచి బడ్జెట్ వస్తుందని నిర్మాతలు భావించారట. అయితే ప్రొడ్యూసర్‌ వాదనతో తాను విభేదించినట్టు.. దర్శకుడు కృష్ణవంశీ తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. నాగార్జున వంటి స్టార్ నటుడు వస్తే సినిమా బడ్జెట్ ఎక్కువవుతుందని, అంతేకాకుండా, సినిమాలో రెండు ముఖ్యమైన పాత్రలు ఉండటం వల్ల నాగార్జున స్టార్‌డమ్ ఆ పాత్రల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తుందని కృష్ణవంశీ ఫీల్ అయ్యాడట. ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్‌కు వివరించి.. నాగార్జున కాకుండా.. శ్రీకాంత్‌ను తన రోల్‌ కోసం తీసుకున్నాడట కృష్ణవంశీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Minister Nara Lokesh: TDP నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కు బాధ్యతలు

Andhra Pradesh: చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..

Singer Mangli Case: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్

Hyderabad: నిజాం నగల పేరుతో మోసం.. పోలీసుల దర్యాప్తు

POCSO Case: 108 మంది బాలికలపై లైంగిక వేధింపులు

Follow Us