Ram Charan: డెకాయిట్‌కు చరణ్ అదిరిపోయే రివ్యూ..
రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ బిజీలో 'డెకాయిట్' మూవీని చూసి ప్రశంసలు కురిపించారు. హరి పాత్రలో శేష్ నటన అద్భుతమని, మృణాళ్ ఠాకూర్ సినిమాకు పెద్ద అసెట్ అని కొనియాడారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు, హైటెక్నికల్ వాల్యూస్ అద్భుతమంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్‌ను పరిగెత్తిస్తున్న రామ్ చరణ్.. మధ్యలో గ్యాపిచ్చి మరీ ఎస్క్వైర్ ఇండియా మ్యాగజీన్ కు టైమిచ్చాడు. ఆ మ్యాగజీన్ రిలీజ్ చేసిన పిక్స్‌తో ఇప్పుడు ఆలోవర్ వరల్డ్ ట్రెండ్ అవుతున్నాడు. ఇలా ట్రెండ్ అవుతున్న చరణ్ కు కాస్త టైం దొరికిందేమో తెలీదు కానీ.. తాను డెకాయిట్ మూవీ చూసినట్టు ట్వీట్ చేశాడు. ఈ మూవీకి తన స్టైల్లో ఓ షార్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ఇప్పుడే డెకాయిట్ సినిమా చూశాను ఈ సినిమా చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశానంటూ ట్వీట్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హరి పాత్రలో శేష్ తన నటనతో.. సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లారని.. శేష్ నటన చాలా కాలం పాటు గుర్తుండిపోతుందంటూ చరణ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. డెకాయిట్‌లో మరో లీడ్.. మృణాళ్ ఠాకూర్ తన పాత్రకు ప్రాణం పోశారని.. ఈ సినిమాకు ఆమె నటనే ఒక పెద్ద అసెట్ అంటూ చరణ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. వీరే కాకుండా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఇతర నటీనటులు కూడా అద్భుతమైన నటనను కనబరిచారంటూ చరణ్ రాసుకొచ్చారు. సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ కథను నమ్మి ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారని చరణ్ కొనియాడారు. హైటెక్నికల్ వాల్యూస్ తో సినిమాను ప్రజెంట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉందని.. చిత్ర బృందం మొత్తానికి అభినందనలు అంటూ చరణ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీలో.. బిగ్ ట్విస్ట్
చేపల కోసం చెరువులోకి వల వేసాడు.. దొరికింది చూసి స్టన్ అయ్యాడు..
బయటపడిన ఉండవల్లి గుహల రహస్యాలు ఇవే
ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం
గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు
ఎండలు ముదురుతున్నాయ్.. బీ అలర్ట్
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
అనంతపురంలో సిమ్లా యాపిల్స్ సాగు.. ఇదిగో ఇలా..

