AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

V.V. Vinayak: అసలు మహేష్‌ను ఛాన్స్‌ ఎందుకు అడగాలి ??

V.V. Vinayak: అసలు మహేష్‌ను ఛాన్స్‌ ఎందుకు అడగాలి ??

Phani CH
|

Updated on: Apr 16, 2026 | 1:21 PM

Share

వీవీ వినాయక్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో పూరీ జగన్నాథ్-మహేష్ బాబు వివాదంపై స్పందించారు. 'మంచి కథ ఉంటే హీరోలే దర్శకుల వద్దకు వస్తారు' అంటూ వినాయక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వివరణ కొంతమంది మహేష్ అభిమానులను నిరాశపరిచింది. టాలీవుడ్‌లో దర్శకుడు-హీరో సంబంధాలపై ఈ కామెంట్స్ కొత్త చర్చకు తెరలేపాయి.

టాలీవుడ్ లో వన్‌ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ గా నామ్ కమాయించిన వి. వి. వినాయక్.. గత కొన్నాళ్లుగా సినిమా మేకింగ్‌కు దూరంగా ఉంటున్నాడేమో కానీ ఇండస్ట్రీకి మాత్రం దగ్గరగానే ఉంటున్నాడు. కొన్ని రోజుల ముందు నుంచి అయితే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌తో బోలెడన్ని విషయాలను పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ – మహేష్‌ విషయంలో ఓ కామెంట్ చేసి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. గతంలో పూరీ జగన్నాథ్.. మహేష్ బాబు గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. అయితే దీనిపైనే.. ఓ షోలో వినాయక్‌కు ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే వినాయక్ తన దైన వివరణ ఇచ్చాడు.ప్రతి దర్శకుడికి కొన్ని ఒడిదొడుకులు సహజమని, అంత మాత్రాన ఒక హీరోను తప్పుపట్టలేమని తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు వినాయక్. అలా వివరణ ఇచ్చే క్రమంలోనే పూరీ జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్ మహేష్ బాబును సినిమా అవకాశం అడగాల్సిన అవసరం లేదంటూ చెప్పాడు. మంచి కథ ఉంటే హీరోలే దర్శకుల దగ్గరకు వస్తారని వినాయక్ అన్నాడు. అయితే వినాయక్ నోటి నుంచి వచ్చిన ఈ లైన్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. దాంతో పాటే కొంత మంది మహేష్ అభిమానులను కూడా నొచ్చుకునేలా చేశాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varun Tej: వరుణ్‌ తేజకు గాయం.. అపోలోలో సర్జరీ !!

Ram Charan: డెకాయిట్‌కు చరణ్ అదిరిపోయే రివ్యూ..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీలో.. బిగ్ ట్విస్ట్

నాగార్జున వద్దు.. నా సినిమాలో శ్రీకాంతే కావాలి

Follow Us