రాయడం మీ హాబీనా? అయితే సులభంగా బ్లాగర్ అవ్వడం ఎలానో తెలుసుకోండి
16 April 2026
Anand T
నేటి డిజిటల్ యుగంలో రాయడం అంటే ఇష్టం ఉన్నవారికి సులభంగా ఆదాయం సంపాదించి పెట్టే మార్గం బ్లాగింగ్. కొంచెం ఓపిక, నైపుణ్యం ఉంటే మీరు కూడా ఒక అద్భుతమైన బ్లాగర్ అవ్వొచ్చు అదెలానో తెలుసుకుందాం.
బ్లాగర్
మీరు ఏ విషయం గురించి రాయడానికి ఇష్టపడుతున్నారో ముందుగా నిర్ణయించుకోండి. ప్రయాణాలు, సాహిత్యం, లైఫ్ స్టైల్, ఫిట్‌నెస్ వంటి అంశాలపై రాసే వ్యాసాలకు పాఠకులు ఎక్కువగా ఉంటారు.
టాపిక్
WordPress లేదా Blogger వంటి ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగించి మీకంటూ ఒక స్వంత బ్లాగ్‌ను తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక మంచి వెబ్‌సైట్‌ను డిజైన్ చేసి మీరు రాసిన కంటెంట్‌ను పోస్ట్ చేయడం ప్రారంభించండి.
బ్లాగ్ ప్రారంభించడం
మీరు రాసే కంటెంట్ అర్థవంతంగా, స్పష్టంగా ఉండేలా చూసుకోండి. మీ కంటెంట్‌ను బట్టే మీ వ్యూవ్స్, ఫాలోవర్స్ పెరుగుతారు. కాబట్టి కంటెంట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి.
స్పష్టత
మీ వ్యాసాలు ఎక్కువ మందికి చేరాలంటే SEO చాలా కీలకం. సరైన కీవర్డ్స్, ఆకట్టుకునే హెడ్‌లైన్ ఇవ్వడం ద్వారా గూగుల్ సెర్చ్‌లో మీ బ్లాగ్ త్వరగా ర్యాంక్ అవుతుంది
SEO
మీ బ్లాగ్‌ను ఎక్కువ మంది చదవాలంటే వాటిని వాట్సాప్, ఫేస్‌బుక్,ఇన్‌స్టా, ఎక్స్ వంటి సోషల్ మీడియాను ప్లాట్ ఫామ్‌లలో షేర్ చేయండి. దీని వల్ల మీ వీవర్స్ ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
సోషల్ మీడియా
ఈ వెబ్‌సైట్‌లో నుంచి ఆదాయం కూడా పొందవచ్చు. వెబ్‌సైట్‌కు వచ్చే యాడ్స్, అఫిలియేట్ లింక్స్ ద్వారా మీరు ఆదాయం పొందవచ్చు.
ఆదాయం
ఒక మంచి బ్లాగర్‌గా ఎదగాలంటే ఓపిక చాలా అవసరం. కొన్ని రోజుల పాటు లేదా నెలల పాటు కష్టపడితేనే మంచి ఆదాయం వచ్చే స్థాయికి చేరుకోగలరు.