తక్కువ ఖర్చుతో ఊటీ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్!

Prasanna Yadla

16 April 2026

Pic credit - Pixabay

మీ కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే, మీ కోసమే ఐఆర్‌సీటీసీ కొత్త టూరును  తీసుకొచ్చింది. 

ఐఆర్‌సీటీసీ కొత్త టూరు

అతి తక్కువ ఖర్చులోనే ఊటీ నుంచి కూనూర్ టూర్ ప్యాకేజీలను తెచ్చింది. 

ఊటీ నుంచి కూనూర్ 

ఇద్దరు షేరింగ్ అయితే రూ.16,360, ముగ్గురు షేరింగ్ రూ.14,360 చార్జీలు వసూలు చేయనుంది. 

 ముగ్గురు షేరింగ్ రూ.14,360 

ఇక పిల్లలతో కలిపి అయితే రూ.6300, బెడ్ లేకుండా రూ.3950 ఛార్జీలు వసూలు చేస్తుంది.

బెడ్ లేకుండా రూ.3950

 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు రైలు మొదలు కానుంది. 

మొదటి రోజు

ఆ తరువాత రోజు ఉదయం 9.10 గంటలకు కోయంబత్తూర్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లి బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ చూస్తారు  

బొటానికల్ గార్డెన్

మూడో రోజు దోడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకరా ఫాల్స్‌ను చూస్తారు. నాలుగో రోజు కూనూర్ టీ గార్డెన్ చూస్తారు

టీ మ్యూజియం

ఐదో రోజు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు బయల్దేరతారు శబరి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం ఉంటుంది

ఐదో రోజు