బెంగళూరులోని శేషాద్రిపురంలో ఇరుగుపొరుగు వారి పిల్లి పోరు తీవ్రమైంది. ఆడపిల్లి నాలుగు పిల్లలను ఈనడంతో, మగపిల్లి యజమానిని బాధ్యుడిని చేస్తూ కోపంతో గొడవపడ్డాడు ఆడపిల్లి యజమాని. పిల్లి పిల్లలను మగపిల్లి ఇంటిలో వదిలేయడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ పెరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.