AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: 4 టన్నుల పుష్పాలతో అమ్మవారికి పుష్పయాగం.. మహోత్సవాన్ని కనులారా చూసి పులకించిపోయిన భక్తులు

12 రకాల పుష్పాలు. 6 రకాల పత్రాలు. మొత్తం 4 టన్నుల పుష్పాలతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి పుష్పయాగ మహోత్సవం. శోభాయ‌మానం ఆ దృశ్యం. రంగు రంగుల పుష్పాల మధ్య దేధీప్యమానంగా వెలుగొందారు.

Tirupati: 4 టన్నుల పుష్పాలతో అమ్మవారికి పుష్పయాగం.. మహోత్సవాన్ని కనులారా చూసి పులకించిపోయిన భక్తులు
Tiruchanur Pushpa Yagam
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 30, 2022 | 3:55 PM

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన తర్వాత పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం చేశారు.

4 టన్నుల కుసుమాలతో అమ్మవారి పుష్పయాగం

పుష్పయాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో రెండు టన్నులు తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, మరో టన్ను తెలుగు రాష్ట్రాల నుండి దాతలు అందించారు. తొలుత ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు. ఆ తర్వాత శ్రీ కృష్ణముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

12 రకాలు పుష్పాలు, 6 రకాల పత్రాలతో పుష్పాంజలి

వైదికుల వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, ప‌గ‌డ‌పు పూలు వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Ammavaru

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..