Health Tips: రాత్రి పడుకునే ముందు ఈ పని చేయండి చాలు.. బరువు తగ్గి ఫిట్‌గా మారుతారు.. అంతే..

ప్రస్తుత కాలంలో చాలామంది అత్యధిక బరువుతో బాధపడుతున్నారు. జీవనశైలితోపాటు.. తీసుకుంటున్న అనారోగ్యకరమైన ఆహారం ఊబకాయానికి దారితీస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు.. ఊబకాయానికి గురవుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Health Tips: రాత్రి పడుకునే ముందు ఈ పని చేయండి చాలు.. బరువు తగ్గి ఫిట్‌గా మారుతారు.. అంతే..
Weight Loss Tips
Follow us

|

Updated on: Nov 29, 2022 | 7:38 PM

ప్రస్తుత కాలంలో చాలామంది అత్యధిక బరువుతో బాధపడుతున్నారు. జీవనశైలితోపాటు.. తీసుకుంటున్న అనారోగ్యకరమైన ఆహారం ఊబకాయానికి దారితీస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు.. ఊబకాయానికి గురవుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే, చాలామంది బరువును తగ్గించుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తారు. జిమ్ లో చెమటోడ్చడం, పలు డైట్లను అనుసరించడం చేస్తారు. ఇంత చేసినా కొందరు బరువు తగ్గారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ చెందాల్సిన పనిలేదని.. మరికొన్ని చిట్కాలతో బరువు తగ్గొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రి నిద్రించే సమయంలో కూడా మన శరీరంలో కేలరీలు ఖర్చవుతాయని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి శరీరాకృతిని పొందవచ్చంటున్నారు. రోజూ రాత్రి (Sleep) పడుకునే ముందు మీరు చేయాల్సిన పనులు ఏమిటో ఇప్పుడు తెలుకుందాం..

ఫిట్‌గా ఉండాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేయండి..

రాత్రి 7 గంటలకే భోజనం చేయడం..

శరీర బరువును తగ్గించుకోవాలనుకుంటే.. ముఖ్యంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం రాత్రి 7 గంటలకే భోజనం చేయాలని.. ఆ తర్వాత భోజనం చేయవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల సరిగా జీర్ణం కాక స్థూలకాయం వేగంగా పెరుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకుంటే ఈరోజే ఆలస్యంగా తినే అలవాటును మానుకోండి.. అదే సమయంలో రాత్రి భోజనం, నిద్ర మధ్య కనీసం 3 గంటల గ్యాప్ ఉంచాలి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి

ఊబకాయంతో బాధపడుతుంటే.. ఎల్లప్పుడూ తేలికపాటి, ఆరోగ్యకరమైన భోజనం చేయాలి. బరువు తగ్గడానికి రాత్రి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. డిన్నర్‌లో సూప్, సలాడ్, రోటీ, పప్పు మొదలైనవాటిని చేర్చుకోవచ్చు. దీనివల్ల పొట్ట నిండటంతోపాటు బరువు పెరగదు.

ఇవి కూడా చదవండి

వేడి నీరు తాగండి..

బరువు తగ్గాలనుకుంటే రాత్రి భోజనం తర్వాత ఖచ్చితంగా వేడి నీటిని తాగాలి. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గడం సులభం అవుతుంది. గ్రీన్ టీ తాగితే జీవక్రియ బలపడుతుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలోనూ సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.