AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Bags Side Effects: రోజూ టీ బ్యాగ్స్ ఉపయోగిస్తున్నారా..? అయితే, ఈ విషయం తెలిస్తే గుండె గుభేలే..

వేడి నీటిలో ప్లాస్టిక్ టీ బ్యాగ్‌లను ముంచినప్పుడు దానిలో ఉన్న హానికరమైన పదార్థాలన్నీ విడుదలవుతాయి. నైలాన్ టీ బ్యాగులు.. పాలీప్రొఫైలిన్ కు అతిపెద్ద మూలం. పేపర్ టీ బ్యాగ్‌లకు కూడా ప్రత్యేక పదార్థంతో పూత పూస్తారు.

Tea Bags Side Effects: రోజూ టీ బ్యాగ్స్ ఉపయోగిస్తున్నారా..? అయితే, ఈ విషయం తెలిస్తే గుండె గుభేలే..
Tea Bags Side Effects
Shaik Madar Saheb
|

Updated on: Nov 28, 2022 | 1:55 PM

Share

Side Effects of Tea Bags: టీ.. చాలామంది జీవితంలో భాగం. కొందరి ఒక కప్పు టీ లేనిదే.. రోజు ప్రారంభం కావడం కష్టం.. ఇంకొన్నిసార్లయితే.. బిస్కెట్‌లతో కూడా టీ తీసుకుంటారు. అప్పడే.. టీ ప్రియుల రోజు సంపూర్ణంగా ప్రారంభమవుతుంది. అలసటగా ఉన్నా, తలనొప్పి వచ్చినా.. టీని లేదా గ్రీన్ టీని చాలామంది టీ తాగుతారు. అయితే, టీని చాలా రకాలుగా తయారు చేస్తారు. కొందరు టీ ఆకులను కొంటారు.. టీ పొడిని తీసుకుంటారు. మరికొందరు గిన్నెలను కడగడం లాంటి ఇబ్బందులను వదిలించుకునేందుకు టీ బ్యాగ్‌లను ఉపయోగిస్తారు. మీరు కూడా టీ బ్యాగ్‌లను ఉపయోగిస్తే.. అలాటి నిర్ణయాన్ని వెంటనే మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ బ్యాగ్స్‌తో జాగ్రత్తగా ఉండాలని.. దాంతో ఆరోగ్యానికి ప్రయోజనం కంటే హాని ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ బ్యాగ్‌లలోని రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని.. దీంతో క్యాన్సర్ ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఇది నిర్ధారణ అయింది. ప్లాస్టిక్ టీ బ్యాగ్ ద్వారా తయారు చేసిన ఒక కప్పు టీలో అనేక హానికరమైన పదార్థాలు ఉంటాయని అధ్యయనం పేర్కొంది. 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్‌ను దీనిలో ఉపయోగిస్తారని పేర్కొంది. అయితే, ఒక కప్పు వేడి పాలలో లేదా వేడి నీళ్లలో 5 నిమిషాల పాటు టీ బ్యాగ్ ఉంచడం ద్వారా.. 11.5 బిలియన్ల అతి చిన్న హానికరమైన మైక్రోప్లాస్టిక్‌లు వృద్ధి చెందుతాయని పరిశోధకులు తెలిపారు. అంటే.. 1 మిలియన్ నానోప్లాస్టిక్స్ అన్న మాట.. ఈ విషయం ఎంత సీరియస్‌గా ఉందో ఈ అధ్యయనం ద్వారా అర్థం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు దీని గురించి మాట్లాడుతూ.. వేడి నీటిలో ప్లాస్టిక్ టీ బ్యాగ్‌లను ముంచినప్పుడు దానిలో ఉన్న హానికరమైన పదార్థాలన్నీ విడుదలవుతాయి. నైలాన్ టీ బ్యాగులు.. పాలీప్రొఫైలిన్ కు అతిపెద్ద మూలం. పేపర్ టీ బ్యాగ్‌లకు కూడా ప్రత్యేక పదార్థంతో పూత పూస్తారు. ఈ రసాయనాన్ని ఎపిక్లోరోహైడ్రిన్ అంటారు. పేపర్ టీ బ్యాగ్ ఆకారాన్ని చెక్కుచెదరకుండా ఉంచేందుకు ఈ రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఎపిక్లోరోహైడ్రిన్ వేడి నీటిలో కరిగిపోతుంది. ఎపిక్లోరోహైడ్రిన్ క్యాన్సర్ కారకమైనది లేదా క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రసాయనం చాలా హానికరమని, శరీరంలోని వివిధ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

మహిళలకు ముప్పు ఎక్కువ

ఇంకా, దీనిలోని రసాయనాలు హార్మోన్ల రుగ్మత, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు వంటి బహుళ వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా స్త్రీల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల PCOD, మెనోపాజ్, సంతానలేమి లాంటి సమస్యలు తలెత్తుతాయి. హార్మోన్ల అసమతుల్యతతో ఎండోమెట్రియోసిస్ సమస్యలు తీవ్రమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

విషపూరిత పదార్థాలు..

మరికొందరు ఆరోగ్య నిపుణులు కూడా టీ బ్యాగ్ ల గురించి పలు ప్రమాదకర విషయాలను వెల్లడించారు. ఎపిక్లోరోహైడ్రిన్ మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో డయాక్సిన్ కోటింగ్ కూడా టీ బ్యాగ్‌లలో ఇస్తారు. వేడి నీటితో సంబంధంలోకి వచ్చిన వెంటనే, పదార్థాలు నీటిలో కరిగిపోతాయి. ఆ పానీయాలు తాగడం వల్ల రసాయనాలు మనిషి శరీరంలోకి చేరి ఆరోగ్యాన్ని రకరకాలుగా దెబ్బతీస్తున్నాయి. ఈ పదార్థాలు విషపూరితమైనవని.. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయని నిపుణులు వెల్లడించారు.

ఈ ప్రమాదాలను నివారించడానికి టీ బ్యాగ్‌లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుున్నారు. టీని నేరుగా నీటిలో ఉడకబెట్టి, వడగట్టి తాగితే మంచిదని.. సాధ్యమైనంతవరకు టీ బ్యాగ్ లకు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..