AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack: లైఫ్‌స్టైల్‌లో ఇలాంటి మార్పులు చేస్తే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చట.. నిపుణులు ఏమంటున్నారంటే..?

ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు చాలా ఎక్కువయ్యాయి. చిన్న వయస్సులోనే గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాల్లో గుండెపోటుతోనేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Heart Attack: లైఫ్‌స్టైల్‌లో ఇలాంటి మార్పులు చేస్తే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చట.. నిపుణులు ఏమంటున్నారంటే..?
Heart Attack
Shaik Madar Saheb
|

Updated on: Nov 27, 2022 | 10:00 AM

Share

How to Prevent Heart Disease: ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు చాలా ఎక్కువయ్యాయి. చిన్న వయస్సులోనే గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాల్లో గుండెపోటుతోనేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కోట్లాది మంది హృదయసంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొంటున్నాయి. అయితే, గుండెపోటుకు చాలా కారణాలున్నాయి. జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం లాంటివి కూడా కారణంగా పేర్కొంటున్నారు. ఇంకా, ఒత్తిడి, వ్యాయామశాలలో గంటల తరబడి గడపడం లేదా రన్నింగ్ వంటి శారీరక శ్రమ వంటివి కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచే కారణాలుగా పరిగణిస్తున్నారు. ఇటీవల నటుడు సిద్ధాంత్ సూర్యవంశీ కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తూ మరణించాడు. దీంతో ఇప్పుడు ప్రజల్లో జిమ్ లేదా ఫిజికల్ యాక్టివిటీపై మోజు తగ్గుతోంది. అయితే, జీవనశైలి మార్పులు రెండవ గుండె స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించగలవు. ఈ వ్యాసంలో, మేము ఒక పరిశోధన ఆధారంగా దానికి సంబంధించిన అవసరమైన సమాచారాన్ని మీకు అందించబోతున్నాము. అదేంటో తెలుసుకోండి..

జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోండి..

జీవనశైలి మార్పులు రెండవసారి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించగలవని కొత్త పరిశోధన వెల్లడించింది. వాస్తవానికి హార్ట్ ఎటాక్ వచ్చినా.. మళ్లీ జిమ్ రొటీన్ పాటిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఓ పరిశోధనలో తేలింది. తగినంత నిద్ర, స్ట్రెస్ కంట్రోల్‌తో వీటన్నింటిని నివారించవచ్చు.

హార్ట్ ఎటాక్ రిస్క్ గురించి పరిశోధన ఏమి చెబుతోంది..

పరిశోధన ప్రకారం.. దీని కోసం సుమారు 1100 మంది పెద్దల డేటాను సేకరించారు. వీరంతా 1990 నుంచి 2018 మధ్యలో గుండెపోటుకు గురయ్యారు. సగటు వయస్సు 73 సంవత్సరాలు. శారీరకంగా దృఢంగా ఉండి, ఇప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో గుండెపోటు ముప్పు 34 శాతం తగ్గుతుందని పరిశోధకులు తమ నివేదికలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..