Health: క్యారెట్లు తినేందుకు సందేహాలు.. పచ్చిగా తినడం మంచిదా.. ఉడికించి తినడం మంచిదా..

ఎర్రని రంగులో చూడగానే నోరూరించే క్యారెట్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిసిందే. వీటిని పచ్చిగా తిన్నా.. కూర చేసుకుని తిన్నా రుచితో పాటు ఆరోగ్యమూ లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే వండిన వాటి...

Health: క్యారెట్లు తినేందుకు సందేహాలు.. పచ్చిగా తినడం మంచిదా.. ఉడికించి తినడం మంచిదా..
Carrots Health Benefits
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 27, 2022 | 7:14 AM

ఎర్రని రంగులో చూడగానే నోరూరించే క్యారెట్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిసిందే. వీటిని పచ్చిగా తిన్నా.. కూర చేసుకుని తిన్నా రుచితో పాటు ఆరోగ్యమూ లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే వండిన వాటి కంటే పచ్చి కూరగాయల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చక్కని ఆరోగ్యానికి అవసరమైన ఎంజైమ్‌లు, విటమిన్లు, ఖనిజాలు పచ్చి కూరగాయల్లో అధికంగా ఉంటాయి. అయితే పచ్చి కూరగాయలను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని జాగ్రత్తలు పాటించకుంటే అవి ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అనేక ఉపయోగాలున్న కూరగాయ క్యారెట్. అవి పచ్చివి, ఆవిరి మీద ఉడికించినవి, వండినవి, కాల్చినవి లేదా సూప్‌లుస, కూరల్లో భాగంగా ఉపయోగిస్తుంటారుర. అయితే.. క్యారెట్‌లను పచ్చిగా లేదా ఆవిరిలో ఉడికించి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

హార్మోన్ల సమతుల్యత: పచ్చి క్యారెట్‌ను తిన్నప్పుడు అందులో ఉండే ఫైబర్.. అదనపు ఈస్ట్రోజెన్‌ను అందిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. మొటిమలు, భావోద్వేగాలను సమతల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పేగు బాక్టీరియా హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే ప్రధాన సమస్యలలో ఒకటి. పచ్చి క్యారెట్లు చెడు బ్యాక్టీరియాను తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది: క్యారెట్లలో విటమిన్ ఏ అధికంగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు 700 నుంచి 900 మైక్రోగ్రాముల విటమిన్ ఏ తీసుకోవాలని సూచిస్తుంది. ఒక పూర్తి పచ్చి క్యారెట్ ను తింటే శరీరానికి అవసరమైనంత విటమిన్ ఏ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

అదనపు ఈస్ట్రోజెన్‌ను తొలగిస్తుంది: క్యారెట్‌లో ప్రత్యేకమైన అజీర్ణ ఫైబర్‌లు ఉన్నాయి. ఇవి అదనపు ఈస్ట్రోజెన్‌ను శరీరం నుంచి బయటకు పంపించంలో సహాయపడతాయి. కాలేయ జీవక్రియను మరింత సమర్ధవంతంగా నియంత్రించేలా చేస్తుంది. పచ్చి క్యారెట్లు ఈస్ట్రోజెన్‌ల పునఃశోషణాన్ని అడ్డుకుంటాయని సైంటిస్తులు కనుగొన్నారు.

క్లియర్ స్కిన్ ను అందిస్తుంది: క్యారెట్లు విటమిన్ ఏ, బీటా కెరోటిన్‌తో నిండి ఉంటాయి. అందువల్ల, పచ్చి క్యారెట్‌లను తినడం వల్ల మొటిమలను తగ్గించడంతోపాటు మంటను తగ్గించవచ్చు. సెల్ టర్నోవర్ను ప్రోత్సహించడం ద్వారా మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది.

థైరాయిడ్ బ్యాలెన్స్‌లో సహాయపడుతుంది: థైరాయిడ్ పనితీరుకు మద్దతిచ్చే విటమిన్ ఎ అద్భుతమైన మూలం కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నవారికి క్యారెట్‌లు గొప్ప పదార్ధం.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..