Diabetic Patients: మధుమేహ ఉన్నవాళ్లు షూస్ కొనుగోలు చేస్తున్నారా..? ఈ విషయాలు తప్పకుండా గుర్తించుకోండి
డయాబెటిస్ చాలా క్లిష్టమైన వ్యాధి. ఇది ఎవరికైనా ఒకసారి వస్తే అది జీవితాంతం వదిలి పెట్టదు. ఆహార నియామలు పాటిస్తూ జీవన శైలిలో మార్పులు చేసుకుని అదుపులో ఉంచుకోవాలి తప్ప..
డయాబెటిస్ చాలా క్లిష్టమైన వ్యాధి. ఇది ఎవరికైనా ఒకసారి వస్తే అది జీవితాంతం వదిలి పెట్టదు. ఆహార నియామలు పాటిస్తూ జీవన శైలిలో మార్పులు చేసుకుని అదుపులో ఉంచుకోవాలి తప్ప.. పూర్తిగా నిర్మూలించలేము. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించినట్లయితే ఎలాంటి సమస్య ఉండకుండా షుగర్స్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సరైన షూలను ఎంచుకోవడం కూడా ఎంతో ముఖ్యం.
పాదాలలో సమస్య:
రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, తగ్గడం కారణంగాపాదాలలో ఉన్న రక్త నాళాలు కూడా ప్రభావితమవుతాయి. దీని కారణంగా పాదాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో చాలా మందికి పాదాలలో గాయాలు ఉంటాయి. అరికాళ్ళ చర్మం గట్టిగా మారుతుంది. ఒక్కసారి గాయం అయితే మానడానికి చాలా సమయం పడుతుంది. అందుకే సరైన బూట్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అయితే డయాబెటిక్ పేషెంట్లు బూట్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
బూట్లు కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
- డయాబెటిక్ పేషెంట్లు పాదాలకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. అందుకే సౌకర్యవంతమైన, పాదాల హాని కలిగించని పాదరక్షలను కొనండి. ఫ్యాషన్ కోసం బిగుతుగా లేదా ఇబ్బందికరమైన బూట్లు ధరించవద్దు.
- మీ పాదాలకు సరిపడ షూస్‌లను కొనుగోలు చేయడం ముఖ్యం. పెద్ద లేదా చిన్న బూట్లు మీ పాదాలకు హాని చేస్తాయని గుర్తించుకోండి. ఇది మధుమేహం పరిస్థితిలో మంచిది కాదు. ఫిట్ షూస్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడంలో ఎంతగానో సహకరిస్తాయి.
- డయాబెటిక్ పేషెంట్ల కోసం మార్కెట్లో అనేక రకాల షూలు అందుబాటులో ఉన్నాయి. పాదరక్షలు ధరించి నడవడంలో కాలి వేళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. లేకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు.
- కాలి వేళ్ల కదలిక సౌలభ్యం ఉన్న చెప్పులు ధరించడానికి ప్రయత్నించండి. దీని వల్ల కాళ్లకు పుండ్లు, పొక్కులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
- మధుమేహ వ్యాధిగ్రస్తులు పొరపాటున కూడా హైహీల్స్ బూట్లు లేదా చెప్పులు కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే ఇది మంచిది కాదు. పాదాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.
- మీరు నడవడానికి ఎక్కువ ఇబ్బందిని కలిగి ఉంటే, లేదా తరచుగా అరికాళ్ళు గట్టిగా మారితే అప్పుడు ప్యాడెడ్ షూలను ఎంచుకోండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..