Diabetes Tips: షుగర్ ఉన్నవాళ్లు బంగాళదుంపలు తినవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వెంటాడుతోవంది. డయాబెటిస్‌ నియంత్రణలో..

Diabetes Tips: షుగర్ ఉన్నవాళ్లు బంగాళదుంపలు తినవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
Diabetes Tips
Follow us

|

Updated on: Nov 25, 2022 | 10:39 AM

దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వెంటాడుతోవంది. డయాబెటిస్‌ నియంత్రణలో లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. దాదాపు 90 శాతం మంది చాలా కాలం నుంచి షుగర్‌తో బాధపడుతున్నారని రిపోర్టుల్లో వెల్లడైంది. ఈ వ్యాధిని జీవనశైలిలో మార్పులు చేసుకుని అదుపులో ఉంచుకోవాలి తప్ప.. పూర్తిగా నిర్మూలించలేము. షుగర్ పేషెంట్లు తమ ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక షుగర్‌ వ్యాధి ఉన్నవాళ్లు బంగాళాదుంప తినాలా వద్దా, ఈ ప్రశ్న తరచుగా తలెత్తుతుంటుంది.

డాక్టర్ సంతోష్ వైద్య తెలిపిన వివరాల ప్రకారం.. ఇందులో షుగర్ పేషెంట్లు సరైన పరిమాణంలో బంగాళాదుంపలను తినవచ్చని చెబుతున్నారు. బంగాళాదుంప ఒక రకమైన కూరగాయ. కానీ ఇది తృణధాన్యాల లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇందులో హార్డ్ కార్బోహైడ్రేట్స్‌తో పాటు స్టార్చ్ కూడా ఉంటుంది. పోటాషియం, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము, జింక్ వంటి అనేక పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. మీరు పోషకాలు అధికంగా ఉండే బంగాళదుంపలను సరైన పద్ధతిలో తీసుకుంటే, రక్తంలో చక్కెర పెరుగుదల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.

బంగాళాదుంపల వినియోగం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారు 70. గ్లైసెమిక్ ఇండెక్స్ 70 కంటే ఎక్కువ ఉన్న ఆహారాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని అంటున్నారు. బంగాళాదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గాలంటే ఆకు కూరలతో తినాలి. డయాబెటిక్ రోగి ఒక రోజులో కనీసం 200 గ్రాముల కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

బంగాళదుంపలను ఇలా వాడండి:

బంగాళదుంపలను ఎప్పుడూ ఇతర కూరగాయలతో కలిపి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు అల్పాహారంగా ఆలూ-పూరీ తినవచ్చు. యాంటీఆక్సిడెంట్ బంగాళదుంపలలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది కాకుండా, బంగాళదుంప కూర, బఠానీలు, క్యాబేజీ, వంకాయలతో తినవచ్చు. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్ మన గుండె, కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరులో సహాయపడుతుంది. బంగాళదుంప తొక్కలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే, మీరు బరువు తగ్గాలనుకుంటే బంగాళదుంపలు తినవద్దు. గుండె జబ్బులు ఉన్నవాళ్లు బంగాళదుంప తినకూడదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..