Winter Skin Care Tips: చలికాలంలో అతి తక్కువ ఖర్చుతో ముఖం మెరిసిపోవాలంటే.. ఈ ప్యాక్ టై చేయండి..

చలికాలంలో ముఖంపై ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో క్యారెట్, తేనె కలిపి ముఖానికి రాసుకోండి. ఆ తర్వాత చూడండి..

Winter Skin Care Tips: చలికాలంలో అతి తక్కువ ఖర్చుతో ముఖం మెరిసిపోవాలంటే.. ఈ ప్యాక్ టై చేయండి..
Carrot And Honey Pack
Follow us

|

Updated on: Nov 24, 2022 | 7:55 PM

చలికాలంలో చర్మం పొడిబారడం అనేది అతి పెద్ద సమస్య. చర్మం పొడిబారడం వల్ల ముఖంలోని మెరుపు అంతా పోతుంది. ఈ సీజన్‌లో ముఖం ఎంత అందంగా ఉన్నా, పొడిబారిన చర్మం వల్ల ముఖ సౌందర్యం మొత్తం తగ్గిపోతుంది. చలికాలంలో నీరు తక్కువగా తీసుకోవడం, ఎండలో ఎక్కువ సమయం గడపడం, వేడినీళ్లను ఎక్కువగా వాడటం వల్ల చర్మంలోని సహజమైన ఆయిల్ తగ్గిపోయి చర్మం పొడిబారడం మొదలవుతుంది. ఈ సీజన్‌లో చర్మాన్ని సంరక్షించుకోవాలంటే ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా కొన్ని ఆరోగ్యకరమైన ప్యాక్‌లను ఉపయోగించడం కూడా అవసరం. ముఖానికి క్యారెట్, తేనె ఉపయోగించడం శీతాకాలంలో చర్మ సంరక్షణకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. క్యారెట్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, క్యారెట్లు చర్మంపై కూడా ప్రభావం చూపుతాయి. క్యారెట్‌ను ప్యాక్‌గా ఉపయోగించడం వల్ల చర్మం ముడతలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. క్యారెట్‌ను చర్మానికి ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు.. చర్మానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

క్యారెట్ చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది:  

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, క్యారెట్ రసంలో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్లు దెబ్బతిన్న చర్మాన్ని బాగా నయం చేస్తాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న క్యారెట్ కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని అనేక పరిశోధనలలో వెల్లడైంది.

దీన్ని చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై క్యారెట్‌ను ఉపయోగించడం వల్ల ఫైన్ లైన్స్, ముడతలు తొలగిపోతాయి. మీరు చర్మం పొడిబారడం వల్ల కూడా ఇబ్బంది పడుతుంటే, మీరు క్యారెట్‌లను శీతాకాలపు చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా చేసుకోవచ్చు. చర్మంపై మెరుపును తీసుకురావడానికి క్యారెట్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

చర్మంపై క్యారెట్, తేనెను ఎలా ఉపయోగించాలి: కావలసినవి:

  • తురిమిన క్యారెట్,
  • ఒక టీస్పూన్ తేనె ,
  • ఒక టీస్పూన్ పాలు

క్యారెట్, తేనె ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి:  

క్యారెట్, తేనె ఫేస్ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో తురిమిన క్యారెట్ తీసుకొని, దానికి ఒక చెంచా పచ్చి పాలు, ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. తయారుచేసిన ప్యాక్‌ను ముఖం నుండి మెడ వరకు అప్లై చేయండి. ఇది సహజంగా ముఖాన్ని తేమ చేస్తుంది. పచ్చి పాలు చర్మంపై క్లెన్సర్‌గా పనిచేస్తాయి. ఇది చర్మం పొడిబారడాన్ని పోగొట్టి చర్మానికి మెరుపునిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఫ్యాషన్ న్యూస్ కోసం