- Telugu News Photo Gallery Experts say that you can get rid of the problem of stuffy nose in winter by following some tips Telugu news
చలికాలంలో వేధించే ముక్కు దిబ్బడ.. ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టేయండి..
చలికాలంలో వచ్చే వాతావారణంలోని మార్పుల వల్ల జలుబు, దగ్గు సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. ఇక ముక్కులో ఉండే అతి సున్నిత త్వచాలు ఉబ్బడంతో ఒక్కోసారి ముక్కు మూసుకుపోయిన భావన కలుగుతుంది. దాంతో ముక్కును బలంగా చీదుతూ ఉండటంతో మరింత వాచిపోతుంది. అలాగే తరచూ నీరు కూడా కారుతూ మనకు మరింత అసౌకర్యాన్ని కలుగజేస్తుంది. అయితే.. ప్రతీసారి డాక్టర్లకు దగ్గరకు వెళ్లకుండానే ఈ టిప్స్ పాటించి ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు....
Updated on: Nov 25, 2022 | 7:22 AM

ముక్కు మూసుకుపోవడం, జలుబు, దగ్గు సమస్యలను అధిగమించేందుకు చాలా ఆయుర్వేద పద్ధతులు ఉన్నాయి. అందులో ఆవిరి విధానం ఒకటి. ఇది చాలా ఉపశమనం ఇస్తుంది. పైగా దీని ప్రభావం కూడా త్వరగా ఉంటుంది. ఇందుకోసం ఒక పాత్రలో నీటిని మరిగించి, ఆ తర్వాత మీ తలను ఒక టవల్‌తో కప్పి, ఆపై ఆవిరి తీసుకోవాలి.

ముక్కు మూసుకుపోవడం వల్ల మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే మీరు దీనిని సులభంగా వదిలించుకోవచ్చు. ఇందుకోసం మీరు వేడి నీటిని తాగడం ప్రారంభించాలి. వేగవంతమైన ఫలితాల కోసం, తేనె, అల్లం రసాన్ని వేడి నీటిలో కలుపుకుని తాగాలి. ఇది బ్లాక్ చేయబడిన ముక్కును తెరవడమే కాకుండా, దగ్గును కూడా దూరంగా ఉంచుతుంది

ఈ రోజుల్లో అనేక రకాల నాసల్ స్ప్రేలు మార్కెట్‌లో వస్తున్నాయి. అవి బ్లాక్ అయిన ముక్కును తెరుస్తాయి. మీకు కావాలంటే డాక్టర్ సలహాపై వీటిని ఉపయోగించవచ్చు. స్పైసీ ఫుడ్ బ్లాక్ చేయబడిన ముక్కును తెరవడంలో మీకు చాలా సహాయపడుతుంది. అలాగనీ మరీ కారం ఉన్న పదార్థాలు అసలు తీసుకోవద్దు. దీనివల్ల మొదటికే మోసం వస్తుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి బాగా కలిపాలి. రోజుకు 3 పూటలా తాగితే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఆ మిశ్రమంలో తేనె కలిపితే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. గోరు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణం కొన్ని చుక్కలను ముక్కులో వేసుకోవడం ద్వారా ముక్కు శ్లేషం సన్నబడి దిబ్బడ సమస్య తగ్గిపోతుంది.

2 టీ స్పూన్ల నిమ్మ రసం, నల్ల మిరియలు, ఉప్పును మిశ్రమంగా చేసుకుని ముక్కుపై అప్లై చేయడం ద్వారా ముక్కు దిబ్బడ సమస్య దూరమవుతుంది. సోంపు, గడ్డి చామంతి, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి వాటిని తీసుకోవడం వల్ల వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.



