Subhash Goud |
Updated on: Nov 25, 2022 | 9:29 AM
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడి ప్రజల నిజాయితీ చాలా ముఖ్యం. నిజాయితీ ద్వారానే దేశం అభివృద్ధి మెట్లు ఎక్కుతుంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 2021 నివేదికలో ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల ఆరు దేశాల గురించి వెల్లడైంది. అవేంటో తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యంత నిజాయితీగల దేశం డెన్మార్క్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదికలో దీనికి మొదటి స్థానం లభించింది. డెన్మార్క్ ఉత్తర ఐరోపాలో ఉన్న ఒక దేశం. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (హెచ్‌డిఐ)లో అగ్ర దేశాల్లో డెన్మార్క్ కూడా ఉంది.
అత్యంత నిజాయితీ గల దేశాల జాబితాలో న్యూజిలాండ్ రెండవ స్థానంలో ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ దేశ జనాభా 51 లక్షలు. న్యూజిలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలోని రెండు పెద్ద ద్వీపాలు, అనేక ఇతర చిన్న ద్వీపాలతో రూపొందించబడిన దేశం ఇది.
ఇక యూరోపియన్ దేశం మూడో స్థానంలో ఉంది. ఫిన్లాండ్ ఉత్తర ఐరోపాలోని ఫెన్నోస్కాండియన్ ప్రాంతంలో ఉన్న ఒక నార్డిక్ దేశం.
సింగపూర్ ప్రపంచంలోనే నాల్గవ అత్యంత నిజాయితీ గల దేశం. ఈ దేశం ప్రపంచంలోని ప్రధాన ఓడరేవులు, వ్యాపార కేంద్రాలలో ఒకటి. పారదర్శకత నివేదికలో మొదటి 5 దేశాలలో సింగపూర్ ఏకైక ఆసియా దేశం.
ఐరోపా దేశం స్వీడన్ ప్రపంచంలో ఐదవ అత్యంత నిజాయితీ గల దేశం. ఈ దేశ రాజధాని స్టాక్‌హోమ్, ఇక్కడ అధికారిక భాష స్వీడిష్. హెచ్‌డిఐలో టాప్ దేశాల్లో స్వీడన్ కూడా ఒకటి.
స్విట్జర్లాండ్ ప్రపంచంలోని ఆరవ అత్యంత నిజాయితీగల దేశంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఇది కూడా ఒకటి. స్విట్జర్లాండ్ భూభాగంలో 60 శాతం ఆల్ప్స్ పర్వతాలతో కప్పబడి ఉంది.